గత వారం రోజులుగా తిరుమల పై జరుగుతున్న కుట్రలో మరో ఆరోపణ, శ్రీవారి వజ్రం అమ్ముకున్నారు అంటూ రమణ దీక్షితులు చేసిన ఆరోపణ... సరిగ్గా అమిత్ షా తిరుమల వచ్చి వెళ్ళిన రెండో రోజే, రమణ దీక్షితులు ఈ విష ప్రచారం మొదలు పెట్టారు.. ఇక దీన్ని పట్టుకుని, జగన్ మోహన్ రెడ్డి సాక్షి చేస్తున్న ప్రచారం అయితే ఇక సరే సరి... వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా చేసిన అరచకాలు అన్నీ ఇన్నీ కావు.. వీరు కూడా కబురులు చెప్తున్నారు.. సరే ఏది ఏమైనా, వీళ్ళు చేస్తున్న విష ప్రచారం పై, టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ స్పందించారు. వారి ఆభరణాల భద్రత విషయంలో జస్టిస్ వాద్వ కమిటీ, జస్టిస్ జగన్నాధరావు కమిటీలు ఆభరణాలు సక్రమంగా ఉన్నాయని టిటిడి కి రిపోర్ట్ ఇచ్చాయిని ఆయాన అన్నారు.
అప్పట్లో ఆభరణాలు అన్ని సక్రమంగా ఉన్నాయని అర్చకులు కూడా రిజిస్టర్ లో సంతకం పెట్టారని, అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. 2001 గరుడసేవ రోజున శ్రీవారి హారంలోని రూబీ డైమండ్ కనపడలేదని కొంతమంది అర్చకులు టిటిడి దృష్టికి తీసుకువచ్చారు. అప్పటి అధికారులు వెతకగా పగిలిన రూబీ డైమండ్ పీసులు ఇప్పటికి టీటీడీ వద్ద ఉన్నాయి. రూబీ డైమండ్ ను వేలం వేశారని రమణ దీక్షితులు చెప్తున్న మాటలు అవాస్తవం అని టిటిడి ఈఓ అనిల్ కుమార్ అన్నారు. ఆగమ సలహాదారులు ఒప్పుకుంటే శ్రీవారి ఆభరణాలను భక్తుల సందర్శనకు ఉంచేందుకు టిటిడి కి ఎటువంటి ఇబ్బంది లేదని అన్నారు. మార్చి 1 1979 నుంచి స్వామివారి కైంకర్యాలు అగమోక్తంగా సమయం ప్రకారం నిర్వహించేలా చర్యలు తీసుకున్నాం అని, జీయర్ స్వాముల పర్యవేక్షణలో స్వామివారి కైంకర్యాలు యధావిధిగా జరుతున్నాయిని అన్నారు. దేవాలయ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని అన్నారు. శ్రీవారి ఆలయంలో తవ్వకాలు జరుగుతున్నాయనేది అవాస్తవం అని, ఆలయం లో చిన్నచిన్న రిపేర్లు జరుగుతున్నాయిని, అవికూడా ఆగమ సలహదారుల సంప్రదింపుల తర్వాతే జరిగాయని టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు.
2013 జనవరిలో ప్రభుత్వ జిఓ నెం 1171, go ms నెం 611ప్రకారం అర్చకులకు 65 సం రిటైర్మెంట్ ను ప్రభుత్వం వర్తింపజేసిందని, జి.ఓ ప్రాకారం ఏ.యస్ నరసింహ దీక్షితులు, భక్తవత్సల దీక్షితులు రామచంద్ర దీక్షితులను రిటైర్ చేశారని చెప్పారు. 956 టిటిడి సర్వీస్ రూల్స్ ప్రకారం టిటిడి లో పనిచేసే ఉద్యోగులు, అర్చకులందరు పదవీవిరమణ చేయాలని ఉందని, సర్వీస్ రూల్స్ ప్రకారమే నూతన ప్రధాన అర్చకుల నియామకాలు జరిగాయని చెప్పారు . మిరాశి రద్దైయాక ప్రధాన అర్చక నాలుగు కుటుంవాలను నుండి ఒక్కక్కరిని తీసుకున్నామని, ఇప్పుడు వంతులు లేకుండా అందరు కలసి ఉత్సవాలు,కైంకర్యాలు నిర్వహిస్తున్నారని, మిరాశి అర్చకులకి గాని,బ్రహ్మణులకు మాత్రం నష్టం జరగలేని చెప్పారు.