ఆంధ్రోడు కొట్టిన దెబ్బకి, కర్ణాటకలో బీజేపీకి చుక్కలు కనిపించాయి...ఒక 10సీట్లు పోయి ఉంటాయి తక్కువలో తక్కువ... ఆ 10 సీట్లే తగ్గినయ్యి మెజారిటికి.... ఆ 10 సీట్ల లోటు పూడ్చుకోవటానికి బేరసారాలు చేసి అడ్డంగా బుక్ అయ్యారు... దేశవ్యాప్తంగా పరువు పోయింది... బీజేపీ వేసుకున్న విలువలు అనే ముసుగు తొలిగిపోయింది.... ఒక్క ముక్కలో చెప్పాలంటే... రెండు నెలల్లో బీజేపీని గుడ్డలూడదీసి నడిరోడ్డు మీద నుంచో పెట్టాడు చంద్రబాబు నాయుడు... ఓటమిని ఒప్పుకుని, ఆటలోకి రాక ముందే తోక ముడిచారు... గాయపడ్డ మనసుకు సాంత్వన లభించినట్లుగా.. నవ్యాంధ్ర ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం నిలబడకపోవడం.. రాష్ట్రంలోనే కాకుండా తెలుగు ప్రజలందరిలోనూ ఆనందం నింపింది...
ఇక్కడ తెలుగు ప్రజలు బీజేపీ ఓటమిని స్వాగతించారు, కాంగ్రెస్ గెలుపుని కాదు అనే విషయం కూడా అర్ధం చేసుకోవాలి.... నవ్యాంధ్రకు కేంద్రం అన్యాయం చేసిందన్న ప్రగాఢ భావన.. దీనివల్లే బీజేపీతో టీడీపీ తెగతెంపులు చేసుకోవడం.. ఇవి కర్ణాటక ఎన్నికలపై పెను ప్రభావం చూపాయి. .. తెలుగువారికి అన్యాయం చేసిన బీజేపీని ఓడించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ఒక్క పిలుపు అక్కడి తెలుగువారందరినీ ఏకం చేసింది. తెలుగువారు ప్రభావం చూపగలిగిన స్థానాలు ఆ రాష్ట్రంలో సుమారు 50 ఉంటే.. అందులో 40 చోట్ల కాంగ్రెస్, జేడీఎ్సలే గెలిచాయి. అయినా బీజేపీ 104 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దానిని అధికారానికి దూరంగా ఉంచేందుకు కాంగ్రెస్.. జేడీఎ్సకు మద్దతు ప్రకటించడం.. జేడీఎస్ నేత కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేసేందుకు అంగీకరించడం చకాచకా జరిగిపోయాయి. చివరకు యడ్యూరప్ప రాజీనామా చేయడంతో కన్నడ ప్రజల్లో ఎంత ఆనందం వ్యక్తమైందో.. తెలుగు ప్రజల్లోను అంతే సంతోషం వ్యక్తమైంది.
చంద్రబాబుకు, ఆంధ్రాకు చుక్కలు చూపుతామని కమలనాథులు, ఇప్పటికైనా మారండి... ఆంధ్ర ప్రజలకు అన్యాయం చేసారు... ఆంధ్రా ప్రజలను ఇంకా ఇబ్బంది పెట్టాలి అని చూసారు.. కడుపు మండిన ఆంధ్రోడి దెబ్బ ఎలా ఉంటుందో చూసారు... చూడటానికి సైలెంట్ గా ఉంటారు కానీ పగ పడితే పాము కన్నా ప్రమాదకరం... ఏ ఆంధ్రుడిని అయితే ఇబ్బంది పెట్టాలి అని చూశావో అదే ఆంధ్రుడు మీ పార్టీని అధికారానికి దూరం చేసాడు.. ఆ ఆంధ్రుడి వల్లే, మీ పార్టీ చేసే దిగజారుడు రాజకీయాలను దేశం మొత్తం తెలిసేలా చేసాడు.. ఇప్పటికి అయినా పద్దతి మార్చుకుని ఆంధ్రాకి న్యాయం చేయండి... లేకపోతే ఈ సారి ఆంధ్రోడు కొట్టే దెబ్బకు మీ భవిష్యత్తు కనుమరుగు అవుతుంది... 125 ఏళ్ళ మీ ఫ్రెండ్ పార్టీని అడగండి, మా ఆంధ్రోడి దెబ్బ ఏంటో క్లియర్ గా చెప్తారు...