బీజేపీ చీఫ్ అమిత్‌షా ‘సంపర్క్ ఫర్ సమర్థన్’ (మద్దతు కోసం భేటీ)ప్రచారంలో భాగంగా, పార్టీ సీనియర్ నాయకులను, మిత్రపక్షాలను, ఇతరులను కలుస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు అమిత్‌షా ముంబై చేరుకొని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేతో భేటీ అయ్యి, అలక మీద ఉన్న శివసేన పార్టీని బుజ్జగించే ప్రయత్నం చేసారు. అయితే, ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఒక వార్తా ప్రచారం జరుగుతుంది. ఆ వార్త ప్రకారం, అమిత్ షా, చంద్రబాబు వద్దకు కూడా వచ్చి, మిత్ర బంధాన్ని కొనసాగిద్దాం అని అడిగినట్టు, దానికి చంద్రబాబు ససేమీరా అన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ పుకార్లుగానే కొట్టి పారేస్తున్న సందర్భంలో, టైమ్స్ అఫ్ ఇండియాలో వచ్చిన కధనం చూస్తుంటే, ఈ వార్తా నిజమేనెమో అనే సందేహం కలుగుతుంది.

shivsena 06062018

ఇది ఆ వార్త సారంశం "It noted that the BJP had broken contact with TDP's Chandrababu Naidu in Andhra Pradesh and questioned if building an equation with him once again will be part of Shah's outreach programme. If Naidu does not agree, YS Jaganmohan Reddy (of the YSR Congress) is available, the Sena sarcastically added. " https://timesofindia.indiatimes.com/india/will-fight-all-elections-solo-says-shiv-sena-before-uddhav-thackerays-meeting-with-amit-shah/articleshow/64477395.cms ఈ వార్త ప్రకారం, చంద్రబాబు ఒప్పుకుంటే సరే సరి, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ ఉన్నాడు కదా, అతన్ని వచ్చి అమిత్ షా కలుస్తాడు అంటూ, ఈ రోజు శివసేన పార్టీ చెప్పింది.

shivsena 06062018

అయితే ఈ విషయం పై ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నారు. "అమిత్ షా గారు !! చంద్రబాబు గారిని కలవాలనుకోవటంలో తప్పు లేదు, కానీ ముందుగా మీ వందిమాగధ బృందం చేస్తున్న తూతూ మంత్రపు బెదిరింపులు,అలివికాని అహంకార అదలింపులు, వదులుకోమని చెప్పండి. రాజకీయాలలో శాశ్వత శత్రువులు ఉండరు ఆనేది నిజమే కావచ్చు, కానీ పరిధిని మించి మీరు, మీ బృందం మరచిపోవచ్చేమో, చంద్రబాబు మర్చిపోవచ్చేమో, కానీ ఆంధ్రోడు మర్చిపోడు. మా అమరావతి ని మీరు చేసిన హేళన మర్చిపోము. మీరు చంద్రబాబును రాజకీయ కోణంలో కలవచ్ఛు,కానీ రాజకీయం కన్నా ముఖ్యమైన మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు.మీకు నాలుగు బిల్డింగ్స్ చాలవా అని అవహేళన గా మాట్లాడారు. మాకు ఇస్తామన్న హామీలు నెరవేర్ఛమంటే రక్షణ బడ్జెట్ కూడా అడుగుతారేమో అని ఎకసెక్కాలాడరు.ఇవేవీ మర్చిపోలేదు, పోము కూడా.. ఇక్కడ రాజకీయంలో మీకో పాత్ర ఉండాలంటే ముందుగా మీ అహంకారానికి ఆంధ్రప్రజలకు క్షమాపణ చెప్పండి." అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమిత్ షా కి చెప్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read