ఎన్నికల్లో అప్రతిహత విజయాలకు బ్రేక్‌ పడటం.. విపక్షాల ఐక్యతారాగం.. స్వపక్షంలో పెదవి విరుపులు.. ఎన్డీయే మిత్ర పక్షాల్లో ఆగ్రహం.. అసంతృప్తులు.. భారతీయ జనతాపార్టీని తొలిసారి ఆత్మరక్షణలోకి నెట్టివేశాయి. గత నాలుగేళ్లలో మితిమీరి ఆత్మవిశ్వాసం తో దూసుకువెళ్లిన మోడీ-షా నేతృత్వంలోని కాషాయ యంత్రాంగానికి కర్నాటక అసెంబ్లి ఫలి తాలు కనువిప్పు కలిగించాయి. అంటీముంటనట్లుగా ఉంటూ వచ్చిన జాతీ య, ప్రాంతీయ విపక్ష పార్టీలు అనూహ్యంగా చేతులు కలిపేందుకు సిద్ధప డటం భాజపాను ఇప్పుడు కలవరపెడు తోంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నిక ల్లో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో ఎదు రైన ఘోరపరాజయాలు ఉలికిపాటుకు గురిచేశాయి. మరొకవైపు ఎన్డీ యేలోని మిత్రపక్షాలు కేంద్రం తీరుపై తిరుగుబావుటా ఎగురవేస్తుం డటం మరింత ఆందోళన కలిగిస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికలు సమీ పిస్తున్న తరుణంలో సొంతపార్టీలోనూ నిరసనలు వినిపిస్తుండటం భాజపా అగ్రనాయకత్వాన్ని ఆలోచనలో పడవేసింది.

modi shah 06062018 2

తక్షణ దిద్దుబాటు చర్యలు అవశ్యమన్న సంకేతాలను ఇచ్చినట్లు అయింది. దీంతో మోడీ- అమిత్‌షా వేగంగా పావులు కదుపేందుకు సిద్ధమయ్యారు.ఈ క్రమం లో అగ్రనేతల అవసరాన్ని గుర్తించి, ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమ వుతోంది. మిత్రులను బుజ్జగించి ప్రసన్నం చేసుకోవడంతోపాటు, అగ్రనేతల సేవల ను వచ్చే ఎన్నికల్లోనూ ఉపయోగించుకోవాలని నిర్ణయించారని తాజా ఘటనలను బట్టి తెలుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో శివసేన మద్దతు కూడగ ట్టేందుకు అమి త్‌ షా ప్రయత్నాలు ప్రారంభించడం, మోడీ స్వయంగా అద్వానీ ఇంటికివెళ్లడం.. అమిత్‌షా కూడా అగ్ర నేతతో చర్చలు జరపడం.. వచ్చే ఎన్నికల్లో పోటీచేయాల్సిం దిగా జోషి, అద్వానీలను కోరడం వంటి పరిణామాలను బట్టి బీజేపీ వ్యూహాలు మారుతున్నట్లు స్పష్టం అవు తోంది. ఇంతకాలం తామే అన్నీఅన్నట్లుగా వ్యవహరిం చిన మోడీ-షా ద్వయం మెట్టుదిగి వస్తున్నది.

modi shah 06062018 3

ఇందుకోసం గత్యంతరం లేక తాము పెట్టిన రూల్, తామే బ్రేక్ చేస్తున్నారు మోడీ - షా. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీలోని కురు వృద్ధులు ఎల్‌కే అద్వానీతోపాటు మురళీమనోహర్‌ జోషిలకు మరోసారి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని మోడీ భావిస్తున్నారు. నిజానికి అమిత్‌ షా పెట్టిన కొత్త రూల్‌ ప్రకారం 75 ఏళ్లు మించిన వాళ్లను పార్టీలో పక్కన పెట్టేస్తున్నారు. కానీ ఇప్పుడు వరుసగా తగులుతున్న షాక్‌లు ఈ నిబంధనపై మరోసారి ఆలోచించేలా చేస్తున్నాయి. గత ఎన్నికల్లో అద్వానీ గాంధీనగర్‌ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికైనా.. ఆ తర్వాత పార్టీలో ఆయనను పూర్తిగా పక్కనపెట్టేశారు. అటు జోషికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో ఈ ఇద్ద రు పార్టీలో అప్రాధాన్య నేతలుగా ఉండిపోయారు. దీంతో పార్టీలోని సీనియర్లతో మోడీ, షా వ్యవహరిస్తున్న తీరుపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నష్టాన్ని పూడ్చుకునే క్రమంలోనే, 2019 ఎన్నికల్లో ఎల్‌కే అడ్వాణీ పోటీ చేస్తే బాగుంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అభిప్రాయపడుతున్నట్లు బెంగాల్‌ పత్రిక ఆనంద్‌ బజార్‌ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆయనతో పాటు మురళీ మనోహర్‌ జోషీ లాంటి అగ్రనేతలను కూడా భాజపా బరిలోకి దించాలని చూస్తున్న ట్లు పేర్కొంది. ఈ విషయమై ఇటీవలే ప్రధాని మోడీ.. అద్వానీని కలిసినట్లు సమాచారం. భాజపా అధ్యక్షు డు అమిత్‌షా కూడా దీనిపై అగ్ర నేతతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో, ప్రతికూ లతలను అధిగమించడంలో బాగంగా మోడీ-షా కొత్త ఎత్తులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read