అందరూ ముసుగులు తీసేస్తున్నారు... మొన్న పవన్ కళ్యాణ్, ఈ రోజు రమణ దీక్షితులు... అందరూ బీజేపీ పెద్దలు ఆధ్వర్యంలో ఆపరేషన్ గరుడ ఫుల్ స్వింగ్ లో ఉంది. చంద్రబాబుని దెబ్బ తియ్యాలి అనే ఉద్దేశంతో అందరు ఏకం అవుతున్నారు.. బీజేపీ, జగన్, పవన్, ఐవైఆర్, ఉండవల్లి, ముద్రగడ, మోత్కుపల్లి, రమణ దీక్షితులు, ఇలా అందరూ ఒకే బాటలో, చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలి, రాష్ట్రము నాశనం అవ్వాలి అనే ఒకే ఒక టార్గెట్ తో ముందుకు వెళ్తున్నారు.. ఈ రోజు, ఇక ముసుగులు తొలగించి మరీ, అందరూ ఏకం అవుతున్నారు. లోటస్ పాండ్ కి వెళ్లి మరీ, రమణ దీక్షితులు, జగన్ ని కలిసారు.. దాదాపు అరగంట పైగా ఇద్దరూ చర్చలు జరిపారు.. రేపు శుక్రవారం కావటంతో జగన్ హైదరాబాద్ వెళ్లారు..
నెల రోజుల నుంచి కోర్ట్ కి సెలవలు.. రేపటి నుంచి కోర్ట్ తెరుస్తున్నారు. అందుకే రేపు శుక్రవారం కావటంతో, జగన్ కోర్ట్ కి వెళ్ళటానికి, హైదరాబాద్ వెళ్లారు.. ఈ నేపధ్యంలో, రమణ దీక్షితులు, 4:15 నుంచి 4:30 గంటల వరకు జగన్ తో భేటీ అయ్యారు. జగన్ స్వయంగా బయటకు వచ్చి, ఆయన్ను దింపి వెళ్లారు. అమిత్ షా తిరుపతి వచ్చి వెళ్లి దగ్గర నుంచి, రమణ దీక్షితులు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అత్యంత విలువైన గులాబీ వజ్రాన్ని ఎవరు దేశం దాటించారని ఆరోపించారు. టీటీడీలో ఎప్పటినుంచో పాతుకుపోయిన సిబ్బంది వల్ల అర్చకులంటే చులకున భావన ఏర్పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమలలో అర్చకుల మాటకు విలువ లేదని, ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని దుయ్యబట్టారు.
అయితే రమణదీక్షితులు మొదలు పెట్టిన దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఎట్టకేలకు టీటీడీ నిర్ణయించింది. అయితే ఇటు రమణదీక్షితులు సైతం తగ్గకుండా టీటీడీపై దాడి కొనసాగిస్తున్నారు. వ్యూహాత్మకంగానే ఆయన దేశంలోని ప్రధాన నగరాల్లో మీడియా సమావేశాలు పెడుతున్నారు. తిరుమలలో అడుగు పెట్టకుండానే ఆయన సాగిస్తున్న దాడిపై తగిన చారిత్రక ఆధారాలతోనూ, న్యాయపరంగానూ ప్రతిదాడి చేయాలని టీటీడీ కూడా సిద్ధమవుతోంది. మొత్తం మీద ఈ వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేట్లుగా లేదు. ఢీ అంటే ఢీ అనే విధంగానే కొనసాగుతోంది. రమణ దీక్షితులు, జగన్ కలియిక, బీజేపీ సూచనల మేరకు జరిగినట్టు తెలుస్తుంది. ప్రతి రోజు మీడియాలో కనిపిస్తున్న ఒక బీజేపీ నేత, ఈ భేటీ దగ్గర ఉండి చేసినట్టు తెలుస్తుంది.