ముఖ్యమంత్రి కుర్చీ కోసం పాదయత్ర చేస్తున్న జగన్, ఈ రోజు కూడా మార్నింగ్ వాక్ మొదలు పెట్టారు. అయితే అనుకోని సంఘటన ఎదురు అయ్యింది. జగన్ యాత్రలో ఉన్న ఒక ఆకతాయి చేసిన పనికి, పాదయాత్రలో ఉన్న అందరూ పరిగెత్తారు. జగన్ తో పటు, ఉన్న సెక్యూరిటీ మినహా అందరూ పారిపోయారు. పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం నడిపల్లికోట కొండాలమ్మ గుడి వద్ద జగన్ 183రోజు పాదయాత్రను ప్రారంభించారు. ఈ క్రమంలో ఓ ఆకతాయి అక్కడే ఉన్న తేనెతుట్టెను రాయితో కొట్టాడు. దీంతో పాదయాత్రలో పాల్గొన్న వారిపై తేనెటీగలు దాడి చేశాయి. దాదాపు 50మంది వరకు తెనెటీగల బారిన పడ్డారు.
కాగా ఈ ఘటనతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది జగన్‌ను రక్షించారు. జగన్ చుట్టూ ఉన్న సెక్యూరిటీ వారు, తుళ్లు, చీరలు పట్టుకుని, జగన్ చుట్టూ విసురుతూ, తేనిటీగలు జగన్ మీదకు దాడి చెయ్యకుండా ప్రయత్నం చేసారు. అయినా కొన్ని వెళ్లి జగన్ ను ఇబ్బంది పెట్టాయి. అయితే, ఆ ఆకతాయి ఎవరు అని అరా తీయగా, వైసీపీ వీరాభిమనే అని తేలింది. సరదాగా అక్కడ ఉన్న తేనెతుట్టెను రాయితో కొట్టాను అని, అవి ఈ విధంగా దాడి చేస్తాయి అనుకోలేదని, అతను అన్నాడు. అయితే, కొంత మంది అక్కడ ఉన్న వారు మాత్రం, సరదాగా మాట్లాడుకుంటూ, ఇది కూడా చంద్రబాబు కుట్ర అని చెప్తే పోలా అంటూ, సటైర్లు వేసారు.
మరో పక్క రాజీనామాల పై జగన మాట్లడారు, రాష్ట్రంలోని 25 మంది ఎంపీలు రాజీనామా చేసి ఉంటే ప్రత్యేక హోదా వచ్చేదని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి వ్యాఖ్యానించారు. ఇది సీఎం చంద్రబాబుకు తెలిసినా.. కేసులు పెడతారన్న భయంతో టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించడంలేదని ఆరోపించారు. నాకు కేసులు అంటే భయం లేదు, కాబట్టే మేము ధైర్యంగా బీజేపీ పై పోరాడుతున్నాం అంటూ వ్యాఖలు చేసారు. ఈ కామెంట్ విన్న విలేకరులు అవాకయ్యారు. జగన్ బీజేపీ పై పోరాటం చెయ్యటం ఏంటో అనుకుని, మనకు తెలీకుండా, ఎప్పుడైనా ఎమన్నా వ్యాఖ్యలు చేసారేమోలే అని సరి పెట్టుకుని, తేనిటీగలను దులుపుకుంటూ, ముందుకు సాగారు.