వైసిపీ ఎంపీల రాజీడ్రామాలు బలే రక్తి కట్టించాయి... అలా రక్తి కట్టించాడు మన ప్రతి పక్ష నేత... ఆయన చేత అలా చేపించాడు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా... ఎప్పుడో మూడు నెలలు క్రిందట రాజీనామా చేస్తే, ఒక పద్ధతి ప్రకారం డ్రామా నడిపించారు... నిజానికి వైసీపీ ఎంపీలు పార్లమెంటు సమావేశాల చివరి రోజే అంటే ఏప్రిల్ 6న రాజీనామా లేఖలను స్పీకర్ ఫార్మెట్‌లో సుమిత్రామహాజన్‌కు ఇచ్చారు. వ్యక్తిగతంగా కలిసి లేఖలు ఇచ్చి రాజీనామాలు ఆమోదించాల్సిందిగా కోరారు. కానీ ఆమె పెండింగ్‌లో పెట్టారు. ఆగష్టులో మళ్లీ పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే వరకు నిర్ణయం తీసుకోరని అందరూ భావించారు.

jagan 06062018 2

ఈలోపే కర్ణాటక ఎంపీలు యడ్యూరప్ప, శ్రీరాములు రాజీనామాలు చేయడంతో అప్పటికప్పుడు ఆమోదింపజేశారు. దీంతో బీజేపీ, వైసీపీ కలిసే రాజీనామా నాటకాలు ఆడుతున్నాయన్న విమర్శలు ప్రారంభమయ్యాయి. ఇవి అంతకంతకూ పెరుగుతుండటంతో చెక్‌పెట్టేందుకు సుమిత్రామహాజన్ హఠాత్తుగా ఎంపీలను పిలిచి మరీ మాట్లాడారు. 29న వారి రాజీనామాలను ఆమోదిస్తారని అందరూ అనుకున్నారు. కానీ స్పీకర్ తన నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఈ రోజు లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్‌తో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వై.వీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, వరప్రసాద్ సమావేశమయ్యారు. తమ రాజీనామాలను వెంటనే ఆమోదించాల్సిందింగా స్పీకర్‌ను కోరారు...

jagan 06062018 3

అయితే, వీరి గుట్టు ఇలా బయట పడింది... రిప్రజెంటేషన్ అఫ్ పీపుల్స్ ఆక్ట్ 1951, సెక్షన్ 151-A ప్రకారం, ఏడాది లోపు ఎన్నికలు ఉంటే, ఉప ఎన్నికలు రావు.. ఒక్క రోజు గ్యాప్ తో, జగన్ ఇలా దొరికిపోయాడు.. మన ఎంపీ లు ప్రమాణ స్వీకారం చేసింది జూన్ 5 2014 న. జూన్ 5 2018 లోపు రాజీనామా చేస్తే వాటిని స్పీకర్ ఆమోదిస్తే, ఉప ఎన్నిక నిర్వహించాలి. అదే రాజీనామాలు జూన్ 5 తరువాత ఆమోదిస్తే జనరల్ ఎలక్షన్స్ కి సంవత్సరమే ఉంటది కాబట్టి ఎన్నికలు నిర్వహించరు. మేము చేసాము అనిపించు కోవచ్చు , ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరము లేదు. అందుకే వైసీపీ ఎంపీ ల రాజీనామాలని ఇన్ని రోజులు నడిపించారు బిజెపి వారు. ఎంతయినా ఇద్దరు ఒక్కటే కదా.. ఇవన్నీ ప్రజలకు తెలియదు, మనం డ్రామా ఆడచ్చు అని, ఇద్దరూ కలిసి అద్భుతమైన డ్రామాకి తెర దింపారు. ఫైనల్ ట్విస్ట్ ఏంటి అంటే, మూడు నెలలు క్రితం రాజీనామా చేసిన, జీతాలు మాత్రం చక్కగా తీసుకున్నారు.. ఈ నెల కూడా జీతం పడింది...

Advertisements

Advertisements

Latest Articles

Most Read