సోషల్ మీడియాలో వికృత ప్రచారం చెయ్యటంలో బీజేపీ ఆరి తెరిందనే విషయం అందరికీ తెలిసిందే... ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, మాయ చేసి, సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చెయ్యటంలో, బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య.. ఇది వారి సక్సెస్ ఫార్ములా అని గర్వంగా చెప్పుకుంటారు కూడా.. ఏమి చెయ్యకపోయినా, ఆహా ఓహో అంటూ, మోడీకి బాకా కొట్టటమే కాదు, వీరికి వ్యతిరేకంగా ఉండే వారి పై వికృతమైన విష ప్రచారం చేస్తారు.. వారిని ముందుగా హిందూ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తారు.. తరువాత, వారి పై విషం చిమ్ముతారు.. ఇలాంటి సంఘటనే కర్ణాటక డీజీపీ విషయంలో జరిగింది.. కుమార స్వామి ప్రమాణస్వీకారం సందర్భంలో, పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ట్రాఫిక్ లో ఇరుక్కున్నారు. ఆమె ఆ విషయం పై కర్ణాటక డీజేపీ పై అసహనం వ్యక్తం చేసారు...
ఇక ఇలాంటి విషయాలు కోసమే చూస్తున్న బీజేపీ, ఈ అంశం పై విష ప్రచారం మొదలు పెట్టింది.. మమత ఒత్తిడి మేరకు, డీజీపీ నీలమణి రాజును, కుమారస్వామి బదిలీ చేసారు అంటూ, విష ప్రచారం చేసింది బీజేపీ... పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ నాలుగు అడుగులు కూడా వెయ్యలేరా ? ఆమెకు అంత అహంకారామా అంటూ ప్రచారం చేసింది. ఈ విషయం నిజమే అనుకుని, ఎంతో మంది మమతను తిట్టారు. కాని ఆ ప్రచారం వాస్తవం కాదు. రాష్ట్ర డీజీపీ నీలమణి రాజును బదిలీ చేసినట్లు వెలువడ్డ వదంతులను కర్ణాటక హోంశాఖ తీవ్రంగా ఖండించింది. నీలమణి రాజు బదిలీ కాలేదని, అదంతా వట్టిదేనని హోంశాఖ పేర్కొంది.
రాష్ట్ర తొలి మహిళా డీజీపీగా నీలమణి రాజు 2017 నవంబరులో బాధ్యతలు చేపట్టారు. 2020 జనవరి 31న ఆమె పదవీ విరమణ చేయాల్సి ఉంది. డీజీపీని రెండేళ్ల వరకు బదిలీ చేయకూదని నిబంధనలు ఉన్నాయి. ఇవన్నీ తెలిసినా, బీజేపీ బ్యాచ్ ఇలా ప్రచారం చేసి, ఇది నిజం అని నమ్మించింది.. ఇప్పటికే బీజేపీ ఇలాంటి ప్రచారం మన రాష్ట్రంలో కూడా మొదలు పెట్టింది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ తిరుమల వివాదం.. ఏమి లేని సమస్యను, సమస్య ఉన్నట్టు సృష్టించి, సాక్షాత్తు వెంకన్నతోనే ఆటలు ఆడుతున్నారు.. ఇలాంటి విష ప్రచారాలు ఇంకా ఎన్నో బీజేపీ నుంచి వస్తాయి.. వీరికి వైసిపీ ప్రశాంత్ కిషోర్ బ్యాచ్, జనసేన చింతలబస్తీ బ్యాచ్ తోడు.. అందరూ కలిసి, రాష్ట్రాన్ని నాశనం చేసే పనిలో ఉన్నారు.. కులాల మధ్య గొడవలు పెట్టే పనిలో ఉన్నారు.. దేశ ప్రజలనే పిచ్చోల్లని చేసి, ఈ బీజేపీ బ్యాచ్ ఆడుకుంటుంది... మన రాష్ట్రంలో అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం..