పోలవరం ప్రాజెక్ట్ పై కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం డబ్బులు టైంకి ఇవ్వకపోయినా, సొంత బడ్జెట్ తో పనులు పూర్తి చేస్తుంటే, మరో పక్క ప్రాజెక్ట్ పూర్తి కాకుండా వెనక్కు లాగుతున్నారు. ఇప్పటికే సవరించిన అంచనాలు, కొన్ని డిజైన్ లు ఇంకా కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. డబ్బులు ఇవ్వటం కోసం, కేంద్రం నెలలకు నెలలు టైం తీసుకుంటుంది. ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ లో మూసేసిన కేసులు రీ ఓపెన్ చేస్తున్నారు. దాంతో పాటు, కొత్త కేసులు కూడా వేస్తున్నారు. అన్ని విధాలుగా, ప్రాజెక్ట్ ఆపటానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చేపట్టిన కాఫర్‌ డ్యాం, డయాఫ్రం వాల్‌ కారణంగా మత్స్యకారుల జీవనోపాధికి నష్టం వాటిల్లుతోందని, నష్టపరిహారం ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌ను సోమవారం జాతీయ హరిత ట్రైబ్యునల్‌ విచారణకు స్వీకరించింది.

polavaram 29052018 2

నాగేశ్వరరావు అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను సోమవారం జస్టిస్‌ జావేద్‌ రహీంతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కాఫర్‌ డ్యాం, డయాఫ్రం వాల్‌ నిర్మాణం కారణంగా నదీ ప్రవాహాన్ని మళ్లించారని తద్వారా మత్స్యకారులకు చాలా నష్టం వాటిల్లుతోందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ప్రగ్యా సింగ్‌ ధర్మాసనం దృష్టికి తీసుకోచ్చారు. కేసును విచారణకు స్వీకరించిన ధర్మాసనం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్టు అథారిటీలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను జులై 31కి వాయిదా వేసింది. అయితే ఈ ఆరోపణల పై పోలవరం అథారిటీ స్పందించింది, ఎలాంటి ఆటంకం ఉండదని, అన్ని విషయాలు గ్రీన్ ట్రిబ్యునల్ కు వివరిస్తామని చెప్పారు. మరో పక్క, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును సవాల్ చేస్తూ కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలైంది. పర్యావరణ అనుమతులు, కేంద్ర జల సంఘం అనుమతులు లేకుండా, పునరావసం, పరిహారం ఇవ్వకుండా, ఎగువ రాష్ట్రాల అంగీకారం లేకుండా ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును నిర్మిస్తున్నారని పిటిషన్ల వేసారు.

polavaram 29052018 3

పురుషోత్తపట్నం ఎత్తిపోతల ప్రాజెక్టును అక్రమంగా నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్లో తెలిపారు. పిటిషన్ స్వీకరించిన ఎన్జీటీ కేంద్ర పర్యావరణ శాఖ, పోలవరం అథారిటీ, కేంద్ర జలవనరుల శాఖ, కేంద్ర గిరిజన శాఖ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్ గఢ్ ప్రభుత్వాలకు, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కు నోటీసులు జారీ చేశాయి. జూలై మూడో వారానికల్లా సమాధానం చెప్పాలని ఎన్జీటీ ఆదేశించింది. గోదావరి జలాలను ఏలేరులో అనుసంధానం చేసే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తపట్నంలో చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టును నిర్మించి పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఏలేరు రిజర్వాయరులోకి 3,500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసి సాగు నీరు, విశాఖ పట్నానికి తాగునీరు, పారిశ్రామిక జల అవసరాలు తీర్చాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఇంత ముఖ్యమైన ప్రాజెక్ట్ ల విషయంలో, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది, ఎవరు ? ఇవి ఎవరు చేపిస్తున్నారు అనే విషయం ఇప్పటికే ప్రజలకు తెలిసినా, వెళ్ళు ఇంకా ఇంకా దిగజారి రాజకీయం చేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read