11 సిబిఐ కేసుల్లో, 5 ఈడీ కేసుల్లో A2... రాష్ట్రాన్ని కొల్లగొట్టి, 16 నెలలు జైల్లో ఉండి, బెయిల్ పై బయట తిరుగుతున్న వ్యక్తి, చంద్రబాబు లాంటి నాయకుడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, టిడిపి నాయకలు ఎందుకు ధీటుగా స్పందించటం లేదు ? నిన్నటి నిన్న, శ్రీవారి నగలు, చంద్రబాబు ఇంట్లో ఉన్నాయి అంటూ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, లోకేష్ స్పందించాడు కాని, తెలుగుదేశం నాయకుల మాత్రం, పెద్దగా స్పందించలేదు. చివరకు చంద్రబాబుని ఒక క్రిమినల్ తిడుతున్నా, నాయకులు ఎందుకు స్పందిచటం లేదో అని, కార్యకర్తలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. అన్నీ చంద్రబాబే చూసుకుంటారని, నాయకులు లైట్ తీసుకుంటున్నారు. చివరకు ఏదన్న విషయం పీకల మీదకు వస్తే కాని, బయటకు వచ్చి వాస్తవాలు చెప్పటం లేదు..
పది సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉండి 2014 ఎన్నికలలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశంపార్టీలో ఇప్పుడు సమన్వయలోపం స్పష్టంగా కనిపిస్తోంది. అన్నీ చంద్రబాబు చూసుకుంటారులే అన్న ధోరణి అగ్రనేతలలో వ్యక్తమవుతున్నది. ఎవరో బుద్దా వెంకన్న లాంటి నేతలు తప్పితే, నిజంగా విషయం వివరించి, వాస్తవం చెప్పే నాయకులే లేకుండా పోయారు. చంద్రబాబును విజయసాయిరెడ్డి అంతలేసి మాటలన్న తర్వాత కూడా టీడీపీ ఎమ్మెల్యేలు ఆ వ్యాఖ్యలను తిప్పికొట్టడానికి ఆసక్తి కనబర్చలేదు. మీడియావాళ్లు వెళ్లి అడిగితే బయటకు వచ్చి ఒకరిద్దరు మాట్లాడుతున్నారు. జరుగుతోన్న పరిణామాలపై టీవీల్లో లైవ్ డిబేట్లలో కూడా, ఒకరిద్దరు తప్పితే, సరిగ్గా తిప్పి కొట్టే నాయకులు లేరు. ఇక సోషల్ మీడియా అయితే, సరే సరి. తెలుగుదేశం సోషల్ మీడియాలో లేదు అని చెప్పుకున్నా ఆశ్చర్యం లేదు.
గత రెండు మూడు నెలలుగా, అన్నీ అవాస్తవాలే ప్రచారం అవుతున్నాయి. లేని సమస్య ఉన్నట్టు, ప్రచారం చెయ్యటంలో, బీజేపీ, వైసిపీ, జనసేన సక్సెస్ అవుతున్నాయి. ఏదన్నా విష ప్రచారం జరుగుతున్న వెంటనే, ఏ టిడిపి నాయకుడు వచ్చి వివరించి చెప్పడు.. చంద్రబాబు వచ్చి చెప్పాలి, లేకపోతే ఆ సమస్య పెద్దది అవ్వాలి, అప్పటి వరకు, ఎవరూ మాట్లాడరు.. అన్ని అధినేతే చూసుకుంటారులే అన్న భావన, ఎక్కువ మంది నాయకుల్లో ఉంది. ఇది ఎన్నికల ఏడాది కాబట్టి పార్టీ అధిష్టానం తక్షణమే చర్యలు తీసుకోవాలని.. లేకపోతే శాపంగా మారే ప్రమాదం ఉందని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. చొరవ లోపించడం...నిర్లక్ష్యం...బద్దకం పెరగడం వల్లనే ఇటువంటి ధోరణి వస్తుందని అంటున్నారు. కార్యకర్తలు కసి మీద ఉన్నారని, మూడు పార్టీలు కలిసి ఎలా దాడి చేస్తున్నారో చూస్తున్నాం అని, టిడిపి నాయకులు ఆక్టివ్ అవ్వాల్సిన సమయం వచ్చిందని, చంద్రబాబు కూడా ఈ లోపం పూరించే పని తొందరగా చెయ్యాలని అంటున్నారు...