ఇప్పుడు జిల్లాలకు, వ్యక్తుల పేర్లు పెట్టే ట్రెండ్ నడుస్తుంది.. ఆ వ్యక్తి మీద ప్రేమతో కాదు, ఆ వ్యక్తి కులం ఓట్లు కోసం.. ఈ ట్రెండ్ తీసుకువచ్చింది మన ఘనత వచించిన ప్రతి పక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి.. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు, గోదావరి జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెడతాను అంటూ, ఆయా సామాజిక వర్గాల ఓట్లు కోసం, దిగాజారుడు రాజకీయం చేస్తున్నాడు జగన్... ఇప్పుడు, ఇదే జగన్ బాటలో, నడుస్తుంది అన్నగారి కూతురు,కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మహిళా సీనియర్ నేత దగ్గుబాటి పురంధేశ్వరి.. ఈ రోజు అన్నగారి పుట్టిన రోజు సందర్భంగా మాట్లాడుతూ, స్వర్గీయ ఎన్టీ.రామారావు పుట్టిన కృష్ణా జిల్లాను ఎన్టీఆర్ జిల్లాగా పేరు మార్చాలని పురంధేశ్వరి విజ్ఞప్తి చేశారు... ఆ జగన్ కంటే బుద్ధి లేదు కాబట్టి అలా అన్నారు, మరి పురంధేశ్వరి గారికి ఏమైంది ?

purandheswari 28052018 2

ఎన్టీఆర్ ఒక జిల్లాకు పరిమితమైన నేతా ? ఇలా మాట్లాడుతూ, పురంధేశ్వరి గారు, ఏమి సంకేతం ఇద్దాం అనుకుంటున్నారు ? చంద్రబాబుని ఇబ్బంది పెడుతూ, ఇలాంటి మాటలు మాట్లాడుతూ, ఆ మహా నాయకుడుని, ఒక జిల్లాకు పరిమితం చెయ్యటం ఏంటి ? ఇది మీకు చాలా అనుకూలం కాబట్టి, చంద్రబాబుని ఇబ్బంది పెట్టటానికి ఇలా అంటున్నారు. మరి, ఎన్టీఆర్ కు భారతరత్న విషయం పై, ఎందుకు మాట్లాడ లేదు ? కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది కదా, మరి ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వమని ఎందుకు అడగరు ? మీ స్నేహితుడు జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, ఎందుకు అడగరు, పురంధేశ్వరి గారు ?

purandheswari 28052018 3

ఇది పక్కన పెట్టండి.. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, శంషాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కు, డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టకుండా, రాజశేఖర్ రెడ్డి అంత అవమానం చేస్తే, ఆ రోజు అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీరు ఏమి చేసారు ? అయినా, సొంత తండ్రిని అడ్డం పెట్టుకుని, ఈ చెత్త రాజకీయాలు ఏంటి ? ఆ జగన్ మోహన్ రెడ్డి కంటే, రాజకీయం తప్ప ఏమి అవసరం లేదు, మరి మీరు కూడా అంతేనే ? ఎలాగూ జగన్ పార్టీలో చేరుతున్నారు కాబట్టి, ఇప్పటి నుంచి, జగన్ చెప్పిన మాటలు పలుకుతూ, మీ తండ్రినే అవమాన పరుస్తున్నారా ? మీకు అంత ప్రేమ ఉంటే, మీ అమిత్ షా, మోడీ తో లాబీయింగ్ చేసి, ఆ మాహానుభావుడికి, భారత రత్న ఇప్పించింది...

Advertisements

Advertisements

Latest Articles

Most Read