విజయవాడ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకోనుంది... దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వంగవీటి కుటుంబంలోని, ప్రముఖ వ్యక్తి జగన్ టార్చర్ భరించలేక తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు సమాచారం... వంగవీటి మోహనరంగా బావమరిది చెన్నుపాటి శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరటానికి రంగం సిద్ధం అవుతోంది... ఈ నెల 7న చెన్నుపాటి శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు సమాచారం... అర్బన్ పార్టీ అధ్యక్షుడు బుద్దా వెంకన్నతో పాటు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ సైతం ఆయనను పార్టీలోకి తీసుకురావటానికి తెర వెనుక కృషి చేసినట్టు తెలుస్తోంది..
వంగవీటి మోహనరంగా ఒకప్పటి ముఖ్య అనుచరులతో ఇప్పటికే చెన్నుపాటి శ్రీను సమావేశం అయ్యారు. ఆదివారం ఐవీ ప్యాలెస్లో రాధా, రంగా మిత్రమండలి ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశాన్ని చెన్నుపాటి శ్రీను నిర్వహించారు. రాధా-రంగా మిత్రమండలి సభ్యులుగా ఉన్న రెండువేలకు పైగా సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీలోకి చేరాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్న చెన్నుపాటి శ్రీను ఆదివారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఆ విషయం వేదిక మీద చెప్పకనే చెప్పారు. అయితే, ఇక్కడ మరో ప్రచారం కూడా జరుగుతుంది. జగన్, తనని వాడుకుని వదిలేసాడు అని, తన బంధువు అయిన గౌతం రెడ్డి, రంగాని బూతులు తిట్టినా, నెత్తిన పెట్టుకోవటం, తనను రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తీసి, కాపు సామాజిక వర్గాన్ని వాడుకుని, అన్యాయం చేస్తున్నాడు అని రాధా ఎప్పటి నుంచో, జగన్ పై కోపంగా ఉన్నారు. నాలుగు నెలల క్రితం, రాధా టిడిపిలో చేరిపోతున్నారు అనే ప్రచారం కూడా జరిగింది. అయితే, మొన్న కృష్ణా జిల్లాలో జగన్ పాదయత్రలో, రాధా పాల్గునటంతో, ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది.
అయితే, ఇప్పుడు స్వయానా వంగవీటి మోహనరంగా బావమరిది, రాధా-రంగా మిత్రమండలిలో ప్రధాన సభ్యడు, రాధాకి వెన్నెంట ఉండే చెన్నుపాటి శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరటంతో, మళ్ళీ రాధా తెలుగుదేశంలో చేరే విషయం పై, ప్రచారం మొదలైంది.... ఒకేసారి కాకుండా, ముందుగా తన బావమరిదిని, తెలుగుదేశంలోకి పంపుతున్నారనే ప్రచారం జరుగుతుంది... జగన్ తో విసుగెత్తి పోయిన రాధా, పార్టీ మారతారని, తెలుగుదేశంలోకి వెళ్తారని, కాదు జనసేనలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ తీరు చూసిన తరువాత, జనసేనలో చేరే విషయం పై రాధా వెనకడుగు వేసారని చెప్తున్నారు. అందుకే, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం వైపు చూస్తున్నారని, కాపులకు కార్పొరేషన్ పెట్టి చంద్రబాబు చేస్తున్న పనులు, రిజర్వేషన్ కోసం ఇప్పటికే కేంద్రానికి పంపియ్యటం వంటివి పరిగణలోకి తీసుకుని, సీటు విషయంలో క్లారిటీ వస్తే, తెలుగుదేశంలోకి వచ్చేస్తారు అని, అందులో భాగంగానే ముందుగా తన బావమరిదిని పంపిస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి, ఇదే కనుక జరిగితే, బెజవాడ రాజకీయంలో అనూహ్య మార్పులు చోటు చేసుకోవటం ఖాయం..