ఈ రోజు రాష్ట్రంలో కుట్రకు ప్లాన్ చేసారా ? శాంతి బాధ్రతలకు విఘాతం కలిగించే భారీ చర్యకు సంఘవిద్రోహ శక్తులు పూనుకున్నాయా ? అవును అనే సమాచారం వస్తుంది. అగ్రిగోల్డ్ బాధితులు, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పోరాటాన్ని ఉధృతం చేశారు. బాధితులకు ప్రభుత్వం వెంటనే రూ.4వేల కోట్లు చెల్లించాలంటూ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన 24గంటల దీక్ష ముగిసింది. దీక్ష తర్వాత, ఈ రోజు ఆత్మఘోష పాదయాత్ర పేరుతో గుంటూరు, గోరంట్ల మీదుగా తాడికొండ వరకు బాధితులు ర్యాలీ చేపట్టటానికి ప్లాన్ చేసారు. అయితే ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి లేదన్నారు. బాధితులు మాత్రం, మేము ర్యాలి చేసి తీరుతాం అంటూ ప్రకటించారు.

kutra 31052018 2

సరిగ్గా ఇలాంటి సమయం కోసం ఎదురు చూస్తున్న సంఘవిద్రోహ శక్తులు, ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా, రాష్ట్రంలో అలజడి రేపటానికి, తుని లాంటి ట్రైన్ తగలబెట్టే పనులు చెయ్యటానికి, ఉపయోగించుకుంటానికి ప్లాన్ చేసాయి. భారీ విధ్వంసం చేసి, మొన్న తమిళనాడులో జరిగిన విధంగా, కాల్పుల దాకా తీసుకువెళ్ళి, ఆగ్రిగోల్ద్ బాధితుల పై ప్రభుత్వం కాల్పులు జరిపింది అనే విధంగా ప్రచారం కోసం ప్లాన్ చేసాయి. అయితే, ఈ విషయం ఇంటెలిజెన్స్ అధికారులు పసి గట్టారు. వెంటనే పోలీసులకు, ప్రభుత్వానికి విషయం చెప్పి, తీవ్రతను తెలియ చేసారు. ఆగ్రిగోల్ద్ బాధితుల ముసుగులో, కుట్రను తిప్పి కొట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ర్యాలీ మొదలు అయితే, పరిస్థితిని అదుపు చెయ్యటం కష్టం అని, ప్రభుత్వం ముందుగానే చర్యలు ప్రారంభించింది.

kutra 31052018 3

నిన్న రాత్రే విషయం తెలుసుకున్న ప్రభుత్వం, ఈ రోజు ఉదయమే మంత్రులను, ఆగ్రిగోల్ద్ బాధితుల వద్దకు చర్చలకు పంపింది. అగ్రిగోల్డ్‌ బాధితులతో మంత్రి నక్కా ఆనందబాబు చర్చులు జరిపారు. అయితే, అక్కడ ఉన్న బాధితుల తరుపున పోరాడుతున్న వారితో, విషయం వివరించి, శాంతి బాధ్రతలకు విఘాతం కలిగించకుండా, సంఘ విద్రోహ శక్తులకు అవకాసం ఇవ్వకుండా, ర్యాలీని విరమించాలని కోరారు. ప్రభుత్వం తరుపున కూడా, అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యను పరిష్కరిస్తామని, కేబినెట్‌లో కీలక నిర్ణయం తీసుకుంటామని ఆనంద్‌బాబు వారికి హామీ ఇచ్చారు. దీంతో పెద్ద మనసు చేసుకున్న ఆగ్రిగోల్ద్ బాధితులు, రాష్ట్రంలో ఎలాంటి శాంతి బధ్రతల సమస్య రానివ్వకుండా, ప్రభుత్వానికి సహకరిస్తూ, ఆందోళనను విరమించుకున్నారు. అగ్రిగోల్డ్‌ బాధితుల సంఘంతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ చర్యలతో, అటు పోలీసు అధికారులు, ఇటు ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read