కార్పొరేట్ సర్వీసు రెస్పాన్స్ బిలిటీ నిబంధన కింద APGENCO 90 లక్షల రూపాయలతో వైద్య పరికరాలు, వివిధ వైద్య పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన ఎక్విప్ మెంట్ గల రెండు ఆరోగ్య రధాలను బుధవారం ముఖ్యమంత్రి ఉండవల్లి నివాసం వద్ద గల గ్రీవెన్సు హాలు దగ్గర ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ రెండు ఆరోగ్య రధాలలో ఒక వాహనాన్ని సీలేరు, రెండవదానిని కడప జిల్లాకు కేటాయించడం జరిగింది. ఈ ఆరోగ్య రధాలతో వివిధ రోగాలకు సంబంధించిన 150 వైద్య పరీక్షలు నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇసీజీ, రక్త పరీక్షలు, అయిదు పెరామీటర్ మోనిటరింగ్ సిస్టం, నీరుడు పరీక్ష, నెబురైజర్, ఆక్సిజన్, హార్టు ఎటాక్ వచ్చిన రోగి వైద్య సేవలు అందించి ప్రమాదం నుండి రక్షించుటకు తగిన సౌకర్యాలు ఈ ఆరోగ్య రధాలలో ఏర్పాటు చేశారు.
ఆరోగ్య రధాలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ ఆయా గ్రామాలలో ప్రజలకు అందుబాటులోకి ఉండి ఉచిత వైద్య సేవలు అందిస్తాయి. ఆరోగ్య రధంలో ఒక మెడికల్ ఆఫీసరు, ఫార్మసిస్ స్టాఫ్ నర్సు, టెక్నీషియన్ ఉంటారు. అవసరమైన మందులు ఉచితంగా అందజేయడం జరుగుతుంది. మలేరియా, టైఫాయిడ్, డెంగీ వంటి వ్యాధులకు సంబంధించిన పరీక్ష ఉచితంగా నిర్వహిస్తారు. క్యాన్సర్ వంటి వ్యాధులను తొలిదశలోనే గుర్తించి, NTR వైద్య సేవ ఆసుపత్రులకు పంపడం జరుగుతుంది. రోగులకు సంబంధించిన వివరాలను ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డులో అప్లోడ్ చేసి రోగి ఆధార్ కార్డును అనుసంధానం చేయడం జరుగుతుంది.
ఆరోగ్య రధాలకు అదనంగా ఒక్కొక్కటి 15 లక్షల విలువగల 3 అంబులెన్స్ లను ఏర్పాటు చేసింది. గిరిజన ప్రాంతాల ప్రజలు ఎవరైనా PHC కి రాలేని వారు ఉంటే ఈ అంబులెన్స్ లు ఆయా గ్రామాలకు పంపి ఇంటి వద్దనే ఉచిత సేవలు అందించడం జరుగుతుంది. 3 అంబులెన్స్ లను సీలేరు, కడప (రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏరియా), ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దులో గల మచ్ ఖండ్ పవర్ ప్రాజెక్టు ఏరియాలకు కేటాయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ జెన్ కో సీఎండీ విజయానంద్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఐ అండ్ ఐ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ పాల్గొన్నారు.