ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి, ప్రజా సేవ చేస్తాను అంటూ, జిల్లాల పర్యటన చేస్తున్న సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పై గత వారం రోజులుగా ఒక ప్రచారం, వార్తల్లోకి ఎక్కింది. దానికి ప్రధాన కారణం ఆయన వారం క్రితం ఆర్ఎస్ఎస్‌కు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గునటం. దీంతో, ఆయన బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు అనే ప్రచారం చాలా బలంగా సాగుతుంది. గత కొన్ని రోజులుగా ఆయన మాట్లాడుతున్న మాటలు కూడా, బీజేపీకి దగ్గరగా ఉంటున్నాయి. ఆయన యాత్రలు మొదలు పెట్టిన మొదటి రోజే, నాకు అన్ని ఆప్షన్స్ ఓపెన్ గా ఉన్నాయి అంటూ, చెప్పారు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జగన్, పవన్ లను, బీజేపీ ఆడిస్తుంది అనే ప్రచారం ఉన్న నేపధ్యంలో, జగన్ ని లోపల వేసిన వ్యక్తిగా, ఆ మూడు పార్టీలతో కలిసి పని చెయ్యరు అనుకున్నారు అందరూ. కాని లక్ష్మీనారాయణ అడుగులు మాత్రం బీజేపీ వైపే అనే అనుమానాలు బలంగా ఉన్నాయి.

jd 31052018 2

ఈ మాటలు బలం చేకూరుస్తూ, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బుధవారం మీడియాతో మాట్లాడిన మాటలు కూడా అలాగే ఉన్నాయి. ఏపీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణా.. కన్నా లక్ష్మీనారాయణా అంటూ విలేకర్లు అడిగిన ప్రశ్నకు కన్నా సమాధానమిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ.. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎవర్ని నిర్ణయిస్తారో వాళ్లే ముఖ్యమంత్రి అవుతారని ఆయన చెప్పారు. దీంతో, 2019 ఎన్నికల్లో ఏపీ బీజేపీ సీఎం అభ్యర్థి మాజీ జేడీ లక్ష్మీనారాయణనే అనే చర్చకు మరింత ఊతం ఇచ్చింది. ఆయన సంఘ్ వ్యక్తి అని.. రానున్న ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీలో చేరతారని విశ్లేషణలు మొదలయ్యాయి.

jd 31052018 3

అయితే ఈ రోజు, ఈ వార్తల పై మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. ఏదో ఓ పార్టీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలో వాస్తవం లేదని, జిల్లాల పర్యటన పూర్తి చేసిన తరువాతే... రాజకీయ నిర్ణయం తీసుకుంటానని మాజీ ఐపీఎస్‌ లక్ష్మీనారాయణ వెల్లడించారు. సమాజానికి తన వంతుగా సేవ చేయాలనే ప్రజల్లోకి వచ్చానని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజా సమస్యలపై అధ్యయనం కోసం పర్యటిస్తున్నానని చెప్పారు. ప్రభుత్వం ముందు ప్రజా సమస్యలను ఉంచుతానని, ప్రభుత్వం ఆ సమస్యలను పరిష్కరిస్తే ఒకలా.. పరిష్కరించకపోతే మరోలా తన పయనం ఉంటుందని స్పష్టం చేశారు. ఎవరు ఎటు వైపో తెలియాలి అంటే, మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.. మొత్తానికి, అన్ని వైపుల నుంచి చంద్రబాబు పై, బీజేపీ అస్త్రాలు వదులుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read