సినీ నటుడు మోహన్ బాబుని తన పార్టీలోకి తీసుకోవటానికి, జగన్ ప్రయత్నాలు మొదలు పెట్టారు... ఇప్పటికే చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తుంది.. మోహన్ బాబు, ఇది వరకు తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు... అయితే, కొన్ని కారణాలతో చంద్రబాబు, మోహన్ బాబుని దూరం పెట్టారు... దీంతో అవకాసం దొరికిన ప్రతిసారి, మోహన్ బాబు, చంద్రబాబు పై మాటల దాడి చేస్తూ ఉంటాడు.. అదే సందర్భంలో, జగన్ ఎంతో గొప్ప నాయకుడు అని పొగుడుతూ ఉంటాడు...ఇది ఇలా ఉంటే, గత కొన్ని నెలల నుంచి మోహన్ బాబు, రాజకీయాల్లో రీ ఎంట్రీ పై లీకులు ఇస్తున్నారు.. త్వరలోనే ఎదో ఒక పార్టీలో చేరాతా అని ప్రకటించారు కూడా... అయితే, ఆయన జగన్ పార్టీలోనే చేరతారని, అందరికీ తెలిసిందే...
ఈ నేపధ్యంలో నెల్లూరు జిల్లా, వెంకటగిరి నుంచి సినీ నటుడు మోహన్‌బాబును బరిలో దింపితే ఎలా ఉంటుందన్న అభిప్రాయానికి జగన్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇదే విషయం పై, మోహన్ బాబుతో చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తుంది. మోహన్‌బాబును ఎలాగైనా ఒప్పించి టికెట్ ఇవ్వాలని అనుకుంటున్నదట. ప్రస్తుతం ఇక్కడ తెలుగుదేశంపార్టీకి చెందిన కురుగుండ్ల రామకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రధానంగా తాగునీటి సమస్యను తీర్చి ప్రజల మన్ననలు పొందారు. సెంట్రల్ లైటింగ్.. రోడ్లు.. విద్యుత్తు వంటి కనీస అవసరాలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. పలుమార్లు ఈ ప్రాంత సమస్యలను అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు... అయితే రెండు సార్లు వరుసుగా గెలిచారు కాబట్టి, మూడో సారి ప్రజలు తిరస్కరిస్తారని, అందుకోసం గట్టి అభ్యర్ధి కావాలని భావించిన జగన్, మోహన్ బాబు కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు..
మోహన్ బాబు వస్తే, రోజాకు తోడుగా ఇష్టం వచ్చినట్టు, మీడియా ముందు నోటికివచ్చినట్లు భూతు పంచాంగం మాట్లాడించి ఆనందం పొందాలని, జగన్ ఆలోచన... కమ్మ సామాజికవర్గం చేత, కమ్మ వారిని తిట్టించి ఆనందం పొందాలన్న ఆలోచనతో జగన్ ఉంటే, తానేదో గోప్పోడినని ఫీల్ అయిపోతూ ఉండే మోహన్ బాబుకి, జగన్ లాంటి వాడే కరెక్ట్ అని అంటున్నారు.. జగన్ తో మొదట్లో బాగానే ఉంటుంది అని, రోజులు గడిచే కొద్దీ, మనోడు చూపించే 70 ఎం ఎం సినిమాకు, మోహన్ బాబుకే మైండ్ పోతుంది అని, వైసిపీ మాజీలు అంటున్నారు.. మోహన్ బాబు వైసిపీ తీర్ధం పుచ్చుకొంటే సినీ పరిశ్రమలోని కొంత మంది, తనకు మద్దతుగా వస్తారనేది జగన్ ఆలోచనగా తెలుస్తుంది....