పవన్ కళ్యాణ్... మొన్నటి దాక సినిమాలు తీసుకుంటూ, అప్పుడప్పుడు వచ్చి సమస్య ఏదన్నా చెప్పగానే, చంద్రబాబు ప్రభుత్వం ఇట్టే ఆ సమస్యను పరిష్కరించేది... 4 ఏళ్ళ దాకా చంద్రబాబుతో ఎలాంటి ఇబ్బంది లేని పవన్, సడన్ గా మార్చ్ 11న ప్లేట్ మార్చేశాడు... చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి విచ్చలవిడిగా జరిగింది అన్నాడు.. ఆధారాలు అడిగితే, ఎవరో అనుకుంటుంటే ఆ విషయం చెప్పా అన్నాడు.. ఇక అప్పటి నుంచి, ప్రతి రోజు కన్ఫ్యూషన్... ఒక్క మాట పై నిలకడ ఉండదు... సడన్ గా మోడీ మీద ప్రేమ పుట్టుకొచ్చింది.. నేషనల్ మీడియాకు ఎక్కి మోడీ నాకు ఆదర్శం అన్నాడు.. ఒక పక్క స్పెషల్ స్టేటస్ కోసం ఆమరణ దీక్ష చేస్తున్నా అన్నాడు, మరో పక్క డబ్బులు ఇస్తే చాలు, ఏదైతే ఏంటి అన్నాడు...

pk 13052018 2

ఇలా ఒకదానికి ఒకదానికి పొంతన లేకుండా, ఇవాళ ఒక మాట, రేపు ఒక మాట.. ఎందుకు బీజేపీ కి లొంగాడో ఎవరికీ తెలియదు... ఈ లోపు సడన్ గా, చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో, పుట్టిన రోజు నాడు ధర్మ పోరాట దీక్ష చేస్తుంటే, అదే రోజు చౌకాబారు ట్వీట్లు మొదలు పెట్టాడు... ఎవరో శ్రీ రెడ్డి అనే అమ్మాయి చేత, 10 కోట్లు ఖర్చు పెట్టి, చంద్రబాబు గేమ్ ఆడిస్తున్నాడు అన్నాడు.. టీవీ చానల్స్ బ్యాన్ చెయ్యాలి అన్నాడు, కేసులు పెడతా అని, లాయర్లతో ఆవేశంగా మాట్లాడుతున్న ఒక వీడియో బయటకు వదిలారు.. చివరకు ఆ కేసులు ఏమయ్యాయో తెలియదు... బ్యాన్ లు ఏమయ్యాయో తెలియదు... కొన్ని రోజులకి పుస్తాకాల ట్వీట్ లు వచ్చాయి... మొత్తానికి ప్రత్యేక హోదా అనే మాట లేదు.. మోడీ అనే మాట పవన్ నోటి వెంట లేదు... షడ్యుల్ చేసిన పర్యటనలు కూడా రద్దు అయ్యాయి... సినిమా ఫుంక్షన్ లకి మాత్రం వెళ్ళాడు.. చివర్లో చింతలబస్తీ దేవ్ వచ్చి, కామెడీ పండించాడు...

pk 13052018 3

అయితే, ఇన్ని రోజులు పవన్ ఖాలీగా ఉన్నాడు.. బయటకు రావటానికి పర్మిషన్ లేదు.. బయటకు వస్తే, బీజేపీని ఎదో ఒకటి అనాలి... అలా అంటే, కర్ణాటక ఎన్నికల్లో ఉన్న కోటి మంది తెలుగు వారికి, మరి కాస్త బీజేపీ పై కోపం పెరుగుతుంది... అందుకే, పవన్ ను నెల రోజుల పాటు, బయటకు రానియ్యకుండా ఆపారు ఢిల్లీ పెద్దలు.. కర్ణాటక ఎన్నికలు, అలా అయ్యయో లేదో, ఇలా బయటకు వచ్చాడు... బస్సు యాత్ర చేస్తాడు అంటూ వార్తలు వస్తున్నాయి... ఇప్పటికే బీజేపీ, 15 తరువాత చుక్కలు చూపిస్తాం అంటుంది... అందుట్లో ఒక చుక్క పవన్... మొత్తానికి, అమిత్ షా డైరక్షన్ లో, కర్ణాటక ఎన్నికలు ముగిసిన వెంటనే వస్తున్నాడు పవన్... అలా అలా బీజేపీని తిడుతూ, చంద్రబాబు ప్రభుత్వం పై, ఎవరో ఎదో అన్నారు, నేను అదే చెప్తున్నా అనే ఆరోపణలు చేస్తాడు... ఎలాగూ గెలిసేది లేదని పవన్ కు కూడా తెలుసు.. అందుకే, చిందరవందర చేసి, చంద్రబాబు వైపు ప్రజలు వెళ్ళకుండా, బీజేపీ కి చంద్రబాబు చేస్తున్న డ్యామేజి నుంచి, బయట పడేయటానికి, బస్సు యాత్రలో రాష్ట్ర వ్యాప్త పర్యటనకు వస్తున్నాడు.. ఇదన్నా సవ్యంగా చేస్తాడో, లేక అన్నిటి లాగే, మధ్యలో ఆపేస్తాడో చూడాలి... అంతా గుజరాత్ నేతల దయ...

Advertisements

Advertisements

Latest Articles

Most Read