అటు రాజధాని కట్టుకోవాటానికి డబ్బులు ఇవ్వరు... మీకు మయసభ కావాలా అని అడుగుతాడు ఒకడు... అన్ని డబ్బులు ఎందుకు, అన్ని ఎకరాలు ఎందుకు అని పుస్తాకాలు రాస్తాడు ఒకడు... అయితే, ఇప్పుడు ఏకంగా, మన దగ్గర భూములు తీసుకుని, కనీసం ఏ కట్టడం కట్టటం లేదు కేంద్రం.. రాజధాని అమరావతిలో కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉత్సాహం చూపాయి... అమరావతిలో తమకు భూములు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని సంస్థలకు లేఖలు రాసి అమరావతిలో కార్యాలయాలకు ఎంత స్థలం అవసరమో చెప్పాలని కోరింది. ఈ నేపథ్యంలో చాలా కేంద్ర సంస్థలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూములు కేటాయించింది..

modi cbn 13052018 2

ఏప్రిల్‌ నెలాఖరు వరకూ 15 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులకు భూములు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం.సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్టుమెంట్‌ (సీపీడబ్లు్యడీ), ఆర్‌బీఐ, ఇండియన్‌ నేవీ, బీఐఎస్, పోస్టల్, కాగ్, ఐగ్నోలకు ఎకరం కోటి రూపాయల చొప్పున భూమి కేటాయించింది. ఎఫ్‌సీఐ, ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ, ఆంధ్రా బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, నాబార్డు, న్యూ ఇండియా ఎస్యూరెన్స్‌ కంపెనీ, హెచ్‌పీసీఎల్, సిండికేట్‌ బ్యాంక్, ఐఓసీఎల్, రైట్స్‌ సంస్థలకు కేటాయించింది. అయితే, ఎన్ని నెలలు గడుతున్నా కేంద్ర సంస్థలు అక్కడ ఏమి కట్టటం లేదు. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంబాధాల నేపధ్యంలో, అమరావతిలో కట్టటం మొదలు పెడితే, ఎక్కడ కేంద్ర పెద్దలకు చెడు అవుతామో అని, ఎవరూ ముందుకు రావటం లేదు.

modi cbn 13052018 3

ఈ విషయం పై రాష్ట్ర ప్రభుత్వం, ఉపేక్షించేది లేదని, కేంద్ర సంస్థల ఏర్పాటులో ఆలస్యాన్ని ప్రశ్నిస్తూ, సంబంధిత భూములను తిరిగిచ్చేయాలంటూ సీఆర్‌డీఏ కేంద్రానికి లేఖ రాసింది. భూమి పొందిన తరువాత మూడు నెలలోగా నిర్మాణాలను ప్రారంభించాల్సి వుంటుందని గుర్తు చేసిన మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ, సంవత్సరాలు గడిచినా పనులు చేపట్టలేదు కాబట్టే నోటీసులు ఇచ్చామని అన్నారు. ఏపీ సర్కారు నోటీసులపై కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సివుంది. మరో పక్క, అదే సమయంలో విద్యా సంస్థల విట్, ఎస్‌ఆర్‌ఎం, బీఆర్‌ శెట్టి, అమృతా యూనివర్సిటీలు వెంటనే పనులు మొదలు పెట్టాయి, విట్, ఎస్‌ఆర్‌ఎం అయితే, ఇప్పటికే క్లాసులు కూడా మొదలు పెట్టాయి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read