మన రాష్ట్రంలో పని చేసిన సిన్సియర్ ఐఏఎస్‌ ఆఫీసర్లలో ఈయన ఒకరు.. ఒకప్పుడు టీటీడీ ఈవోగా పనిచేసారు... ఆయనే ఐఏఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం.. ప్రస్తుతం, రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు... ఒకప్పుడు స్వామి వారికి సేవ చేసిన అనుభువంతో, ఇప్పుడు జరుగుతున్న విష ప్రచారం చూసి, తట్టుకోలేక, బయటకు వచ్చి మాట్లాడారు.. స్వామి వారి కంటే, ఏది ఎక్కువ కాదని, అందుకే వాస్తవాలు చెప్పటానికి వచ్చానని చెప్పారు.. తిరుమలలో ప్రధాన అర్చకుడిగా పనిచేసిన రమణదీక్షితులు చేస్తున్న ఆరోపణలన్నీ అభూతకల్పనలు, అవాస్తవాలని అని అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏకంగా స్వామివారి ప్రతిష్ఠకే భంగం కలిగించేలా వ్యవహరించడం, అబద్ధాలు చెప్పడం సరికాదన్నారు. ఆరోపణలు చేసే వ్యక్తుల గురించి ప్రభుత్వం, టీటీడీ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. ఈ అంశాన్ని ఇంతటితో ముగించి స్వామివారి ప్రతిష్ఠను పెంచాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయంగా పేర్కొన్నారు.

lv 24052018 2

తిరుమలలో అన్ని వ్యవహారాలు చాలా పకడ్బందీగా, కట్టుదిట్టంగా ఉంటాయని ఎల్వీ సుబ్రమణ్యం తెలిపారు. శ్రీవారికి వచ్చిన కానుకలను లెక్కించే పరకామణి నుంచి సూది కూడా బయటకు వెళ్లదన్నారు. ఇక గులాబీ వజ్రం ఏదో పోయిందని ఆరోపణలు చేస్తున్నారు. 1950వ దశకం నుంచి శ్రీవారికి కానుకలుగా వచ్చిన వస్తువుల రికార్డులన్నీ భద్రంగా ఉన్నాయి. గులాబీ వజ్రం అన్నది అసలా జాబితాలోనే లేదు. ఇదే విషయాన్ని ప్రస్తుత ఈవో కూడా చెప్పారు. లేని వజ్రం మాయమైందని ఆరోపణలు చేయడం అత్యంత గర్హనీయం’ అని స్పష్టం చేశారు.

lv 24052018 3

తిరుమలలో ప్రధాన అర్చకుడు, అర్చకులకు పదవీ విరమణ వయసు పెట్టాలని అర్చకులే అడిగారని ఎల్వీ సుబ్రమణ్యం వెల్లడించారు. ‘స్వామి వారికి కైంకర్యాలు చేయడం అత్యంత ప్రీతిపాత్రం.. ఇలాంటి అదృష్టం దక్కడం మా పూర్వజన్మ సుకృతం.. అయితే ఒక వయసు దాటాక శరీరం పట్టుతప్పుతోంది.. స్వామివారికి అభిషేకం చేస్తున్నప్పుడు పట్టుతప్పి పడిపోతే.. చేతిలోని పళ్లెం జారిపోతే అపచారం అవుతుంది.. ఒక వయసు దాటాక చేయడం కష్టంగా ఉంటోంది. అందుకే పదవీ విరమణ పెట్టండని 2011లో పలువురు శ్రీవారి అర్చకులే అడిగారు. అదే సమయంలో ఇప్పుడున్న అర్చకులు పదవీ విరమణ చేస్తే.. వారి వారసులకు అవకాశం వస్తుందనే అభిప్రాయమూ వ్యక్తం చేశారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే పదవీ విరమణ వయసును 65 ఏళ్లుగా నిర్ణయించారు’ అని తెలిపారు. ఈ అంశాన్ని ఇంతటితో ముగించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో... కూడబెట్టుకున్న ప్రతి పైసా ఖర్చుపెట్టుకుని, కొన్ని రోజులు ఉపవాసాలుండి తిరుమలకు వస్తుంటారని, వారందరి మనోభావాలను గౌరవించాలని సుబ్రమణ్యం హితవు పలికారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read