Sidebar

02
Fri, May

నోటికి ఏది వస్తే అది.. మంచి చెడు... ఉచ్చం, నీచం, మర్చిపోయి, గత కొన్ని రోజులగా A2 విజయసాయి రెడ్డి ఎలా పెలుతున్నాడో చూస్తున్నాం... సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబుని, నువ్వు ఒకే అమ్మకు, అబ్బకు పుట్టావా అంటూ, ఎంత చౌకబారు మాటలు మాట్లాడాడో అందరికీ గుర్తు ఉండే ఉంటుంది.. తన వయసుని కూడా పక్కన పెట్టి, వక్ర బుద్ధితో సమాజంలో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు.. ఇప్పుడు తాజగా, మరో చౌకబారు ఆరోపణలు చేసాడు.. ఇందాకా చెప్పుకున్నట్టు, వీళ్ళ రాజకీయానికి ఉచ్చం, నీచం, మర్చిపోయి, చివరకు వెంకన్న విషయంలో కూడా పిచ్చ మాటలు మాట్లాడుతున్నాడు... తిరుమల తిరుపతి దేవస్థానంలోని పోటు నేల మాళిగలోని విలువైన ఆభరణాలను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, హైదరాబాద్‌లలోని ఆయన నివాసాలకు తరలించారంటూ విజయసాయి అన్నారు..

lokesh 23052018 2

ఇంతటితో ఆగలేదు...12 గంటల్లోగా కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) లేదా తెలంగాణ పోలీసులతో చంద్రబాబు నివాసంలో తనిఖీలు నిర్వహిస్తే ఆభరణాలు బయటపడతాయి అంటూ వ్యాఖ్యలు చేసారు.. 12 గంటల కంటే ఎక్కువ సమయం చంద్రబాబుకు ఇస్తే తిరుమల ఆభరణాలు విదేశాలకు తరలిపోతాయని, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ, తన నీచ్ఛ రాజకీయం కోసం, దేవుడితో ఆటలు ఆడుతున్నాడు.. ఈ పిచ్చ వాగుడు పై, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ చాలా ఘాటుగా స్పందించారు.. తన సహజ శైలికి భిన్నంగా, చాలా అంటే చాలా ఘాటుగా, విజయసాయి రెడ్డిని లాచి కొట్టినట్టు, సమాధానం చెప్తూ, తన ట్విట్టర్ లో ట్వీట్ చేసారు లోకేష్...

lokesh 23052018 3

ఇది లోకేష్ ట్వీట్ "గుడిని, గుడిలో లింగాన్ని కూడా మింగే ఘనమైన కుటుంబ చరిత్ర ఉన్న ప్రతిపక్ష నేత, నకిలీ పార్టీ నాయకులు తిరుమల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. తిరుమల ఆభరణాలు, విలువైన ప్రజా సంపదను ఇడుపులపాయ,లోటస్ పాండ్, యలహంకా కోటలో ఉన్న నేలమాళిగల్లో నుండి సిబిఐ తవ్వి తీస్తుంది. ప్రత్యేక హోదా గురించి ప్రధానిని నిలదీసే దమ్ము, ధైర్యం లేని ఏ1, ఏ2 లు పోరాటం చేస్తున్న టీడీపీ పై బీజేపీ తో కలిసి క్విడ్ ప్రో కో రాజకీయాలకు తెర లేపారు.గతంలో తిరుమల జోలికి వచ్చిన వారు ఎక్కడ ఉన్నారో మీకే బాగా తెలుసు. " అంటూ లోకేష్ ట్వీట్ చేసారు.. రెండు రోజుల క్రితం జగన్ మోహన్ రెడ్డికి కూడా ఇలాగే ట్విట్టర్ లో చురకలు అంటించారు... దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్న వారికి, ఇలాగే సమాధానాలు చెప్పాలి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read