చంద్రబాబు అనే నాయకుడు ఎలాంటి పరిపాలన దక్షకుడు అనేది అందరికీ తెలుసు... ఇలాంటి నాయకుడు మీద, నిన్న సాక్షి అనే ఒక రాజకీయ నాయకుడు ఛానల్ లో, "ఎండలు తగ్గించమని, చంద్రబాబు హుకం.. అవాక్కయిన అధికారులు అంటూ" ఒక చెత్త వార్తా ప్రచురించారు.. అది పట్టుకుని, సోషల్ మీడియాలో చంద్రబాబుని హేళన చెయ్యటం ప్రారంభించారు...చంద్రబాబు లాంటి వాడు, ఇలా మాట్లడుతురా ? ఎంత సిల్లీగా వీరి ప్రచారం ఉంటుంది అని చెప్పటానికి ఇది ఒక ఉదాహరణ... వీరికి ఒక్క ప్రజా సమస్య లేదు.. ఇంత ఎండల్లో కూడా, ఎక్కడా త్రాగు నీరుకు ఇబ్బంది అనే వార్తలు లేవు... అందుకే ఏమి చెయ్యాలో తెలియక, ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచురించి, ఆనందం పొందుతూ, ఎదో సాధించినట్టు ఒక్కొక్కడు సైకో ఆనందం పొందుతున్నారు...
నిజానికి వాస్తవం వేరు... నిన్న నీరు ప్రగతి పై, ప్రెస్ కి ఇచ్చిన నోట్ ఇది... కింద రెడ్ మార్క్ పెట్టింది చూడండి... అది పట్టుకుని ఎవడికి కావాల్సింది వాళ్ళు రాసుకుంటూ, చంద్రబాబు అలా అన్నారు అంటూ, పిచ్చ ప్రచారం చేస్తూ, హడావిడి చేసారు.... నిన్న నీరు ప్రగతి పై జరిగిన సమీక్షలో చంద్రబాబు చెప్పింది ఇది... "వేసవిలో వడగాడ్పులు పెరిగే అవకాశం ఉంది.. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గేలా చర్యలు తీసుకోవాలి. ఎక్కడికక్కడ నీటి నిల్వలు పెంచుకోవాలి... రాజధాని ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలు తగ్గేలా చూడాలి... చెరువులు,కాలువలు,జలాశయాల్లో నీటినిల్వలు పెంచాలి... పచ్చదనం,తుంపర సేద్యం ద్వారా ఉష్ణోగ్రతల్లో తగ్గుదల"... ఇది చంద్రబాబు చెప్పింది... దీంట్లో తప్పు ఏమన్నా ఉందా ?
చంద్రబాబుని విమర్శించే వారు, రేపు మధ్యాహ్నం ఒంటి గంటకి అమీర్పేట్ చౌరస్తా లో టెంపరేచర్ ఎంత ఉందో చూడండి.... తరువాత సంజీవయ్య పార్క్ లో ఒక చెట్టు కింద కూర్చుని టెంపరేచర్ ఎంత ఉందో చూడండి... అప్పుడు చంద్రబాబు చెప్పే 10 డిగ్రీలు ఉష్ణోగ్రతలు ఎలా తగ్గించమని చెప్పారో అర్ధమౌతుంది... బుర్ర ఉన్నవాడు ఎవరైనా ఉష్ణోగ్రతలు తగ్గించాలంటే దానికర్థం చెట్లు పెంచటం లాంటివి అని అనుకుంటారు. అది లేని వాళ్ళు ఇలాగే కామెడీలు చేసుకుంటూ వుంటారు. ఉదాహరణకు 1.5దశాబ్దం క్రితం ఇంకుడు గుంతలు అంటే పిచ్చి నవ్వులు వెటకారాలు. మరి ఇప్పుడు తెలుసుగా అవి లేకపోతే ఇల్లు కట్టుకోవటానికి పర్మిషన్ కూడా ఇవ్వరు... చంద్రబాబు కాలి గోటి కూడా సరిపోని వీరు, ఇలా విష ప్రచారం చేస్తూ, ఆయన్ను కించ పరిచే ప్రయత్నం చేస్తున్నారు...