అవినీతి పోలీస్‌ డీఎస్పీ హరిప్రసాద్‌ ఇంట్లో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆయన భార్య పేరి ట ఉన్న ఆస్తుల పత్రాలు దొరకడానికి సంబంధించి ఏసీబీ చేపట్టిన విచారణకు ఎమ్మెల్యే మంగళవారం గైర్హాజరయ్యారు. ‘మా క్లయింట్‌కు ఆరోగ్యం బాగలేదు.. ఆయన తరపున మేం వచ్చాం.. రెండు వారాలు గడువు కావాలి’ అని ఆయన తరపున న్యాయవాదులు ఏసీబీని కోరారు. ‘రెండు వారాలు సాధ్యం కాదు.. ఒక వారం ఇస్తాం.. 29న తప్పనిసరిగా హాజరవ్వాలి’ అని అధికారులు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే తరపు న్యాయవాదులు విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కక్షలో భాగంగానే ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.

alla 23052018 2

రాజధాని ప్రాంతంలో అత్యంత అవినీతిపరుడిగా ఆరోపణలున్న పోలీసు అధికారి దుర్గాప్రసాద్‌పై గతేడాది జనవరిలో ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. ఏసీబీకి ఫిర్యాదులు అందడంతో ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్‌ సెంట్రల్‌ ఇన్వెస్టిగేటివ్‌ యూనిట్‌ (సీఐయూ)ను రంగంలోకి దించారు. దర్యాప్తులో భాగంగా తుళ్లూరు ప్రాంతంలో కొన్ని స్థిరాస్తులు ఇతరుల పేర్లతో ఉన్నట్లు బయటపడింది. ఆరా తీయగా డీఎస్పీ బినామీల్లో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భార్య ఉన్నట్లు తేలింది. ఎమ్మెల్యే భార్య పేరుతో ఉన్న ఆస్తుల పత్రాలు డీఎస్పీ ఇంట్లో లభించడంతో ఏసీబీ అధికారులు ఆయనకు నోటీసు ఇచ్చారు.

alla 23052018 3

ప్రజల సొమ్మును దోపిడీ చేస్తున్న అవినీతిపరులకు కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు అండగా నిలుస్తున్నారని ఈ సంఘటనలు చూస్తే తెలుస్తుంది. క్రికెట్‌ బెట్టింగ్‌లతో జనాన్ని కొల్లగొడుతోన్న బుకీలకు నెల్లూరు రూరల్‌ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అండగా నిలిచారని ఆ జిల్లా ఎస్పీ ఇచ్చిన నివేదిక ఇటీవల సంచలనం సృష్టించింది. నిన్న అనంతపురం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్న కుమారుడు కాంట్రాక్టరును డబ్బు కోసం కిడ్నాప్‌ చేయడం.. తాజాగా ఏసీబీ కేసు దర్యాప్తులో గుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాత్ర వెలుగులోకి వచ్చాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read