పవన్ కళ్యాణ్ ను, బీజేపీ నడిపిస్తుంది అనే ప్రచారం, పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉంది.. పవన్ తీరు కూడా, ఈ ప్రచారానికి బలం చేకూరుస్తుంది.. ప్రత్యెక హోదా పై ప్రధాని మోడీని ఒక్కటంటే ఒక్క మాట అనకపోవటం, నాలుగేళ్ళు చంద్రబాబుని ఆహా ఓహో అని, రాత్రికి రాత్రి చంద్రబాబుని తిడుతూ, మోడీ నాకు ఆదర్శం అని చెప్పటం, అవిశ్వాస తీర్మాన సమయంలో నేషనల్ మీడియాకు ఎక్కి, చంద్రబాబుని బలహీన పరచటం, ఇలా అనేక ఉదహారణలు, పవన్ బీజేపీకి దగ్గరగా ఉన్నాడు అని ప్రూవ్ చేసాయి... ఇప్పుడు కూడా, చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష చేసి, మోడీని ఎండగడుతుంటే, పవన్ కళ్యాణ్ మాత్రం, ఎందుకు అలా చేస్తున్నారు అంటూ హడావడి చేస్తున్నారు.. మరో పక్క విజయసాయి రెడ్డి కూడా, ఇలాగే మోడీ పై ఈగ కూడా వాలనివ్వటం లేదు...
ఇప్పుడు మరో సారి, పవన్ బీజేపీకి ఎంత దగ్గరగా ఉన్నారో, తెలియచేస్తూ, సోము వీర్రాజు, తాజాగా చెప్పారు... ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో, సోము వీర్రాజు మాట్లాడుతూ, పవన్ మా లైన్ లో నే ఉన్నాడు అంటూ, కుండ బద్దలు కొట్టారు.. మా ఉమ్మడి శత్రువు చంద్రబాబు అని, అందుకోసం కలిసి పని చేస్తామని అన్నారు.. పవన్ కల్యాణ్ స్పందించే తీరు, మా బీజేపీ ఆలోచనకు దగ్గరగా ఉందని, ఇది శుభ పరిణామం అంటూ, సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ మా అభిప్రాయాన్ని ప్రతిబింబించే విధంగానే టీడీపీ పాలన పై స్పందిస్తున్నారని, దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు.
ప్రత్యేక హోదా విషయంలో పవన్ కల్యాణ్‌కు ఉన్న సందేహాలను నివృతి చేసి, ఆయనకు నచ్చజెప్పే బాధ్యత తనకు గానీ, మరే ఇతర బీజేపీ నేతలెవరికైనా అప్పజెపితే తాను సందర్భం వచ్చినప్పుడు ఆ పనిని పూర్తి చేస్తామని ఇంటర్వ్యూలో సోము వీర్రాజు చెప్పారు. జనసేనతో పొత్తు విషయమై స్పందిస్తూ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని సోము వీర్రాజు కామెంట్ చేశారు.. వాటికి ఇంకా టైం ఉందని, చంద్రబాబు మాకు ఉమ్మడి శత్రువు అయినప్పుడు, కలిసి పని చేస్తే తప్పు ఏమి లేదని అన్నారు.. మొత్తానికి, పవన్ కళ్యాణ్, బీజేపీ లైన్ లో, బీజేపీ ఆలోచనలకు తగ్గాటే ఉన్నారని సోము వీర్రాజు చెప్పారు.. ఇప్పుడు ప్రజలకి అర్ధమైంది, పవన్ పై మోడీని ఒక్క మాట కూడా ఎందుకు అనటం లేదో... https://youtu.be/ax9-OKQV4rA