ఆపరేషన్ గరుడ అంటే ఏంటో అనుకున్నారు అందరూ.. మీ రాష్ట్రంలో అనిశ్చితి నెలకోల్పుతాం, రాష్ట్రం మొత్తం ఆందోళనలతోనే ఈ సంవత్సరం మీరు గడపాలి అన్నప్పుడు, చుక్కలు చూపిస్తాం అన్నప్పుడు, కేసులు వేసి అరెస్ట్ చేపిస్తాం అన్నప్పుడు, ఇవన్నీ రాజకీయ ఆరోపణలు అనుకున్నాం... కానీ అవే వాస్తవాలు.. ఈ గుజరాత్ ద్వయం చేస్తున్న కక్ష సాధింపు ఇది... మీరు మమ్మల్ని ఎదిరిస్తారా ? 13 జిల్లాల వారు, ఢిల్లీ పీఠాన్ని శాసిస్తారా అనే అహంతో, మన రాష్ట్రం మీద organizedగా దాడి జరుగుతుంది... ఒక పక్క కుల గొడవలు రేపటానికి, ఒకడిని లైన్ లో పెట్టి తిప్పుతున్నారు... మరో పక్క అవకాసం దొరికిన ప్రతిసారి, మతాల మధ్య గొడవలకు ప్లాన్ చేస్తున్నారు (గుంటూరులో జరిగిన సంఘటన)... మరో పక్క లేని వివాదాలు సృష్టించి రచ్చ రచ్చ చేస్తూ, ఎదో జరిగిపోయినట్టు వాతావరణం సృష్టిస్తున్నారు... వీరికి బీహార్ బ్యాచ్, చింతలబస్తీ బ్యాచ్ తోడు... అసలు ఈ తిరుమల ఇష్యూ, ఆపరేషన్ గరుడ అని ఎందుకు అనుకుంటున్నామో చూద్దాం...
అమిత్ షా కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరుమల దర్శనానికి వచ్చారు... దర్శనానికి ముందు, అమిత్ షా తో, రమణ దీక్షితులు దాదాపు 40 నిమషాలు ఏకాంతంగా భేటీ అయ్యారు అనే సమాచారం బయటకు వచ్చింది... అప్పుడు ఎవరూ పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు... అమిత్ షా వెళ్ళిన రెండో రోజే, రమణ దీక్షితులు, చెన్నై వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేసారు... అందులో ప్రధానమైనవి, స్వామి వారికి నైవేద్యం సరిగ్గా పెట్టటం లేదు అని, పింక్ డైమండ్ పోయింది అని, పోటులో నేలమాలిగల్లో నిధి తవ్వేసారు అని... కాని అవన్నీ అవాస్తవాలు అని తేలాయి.. స్వమి వారికి నైవేద్యం సరిగ్గా పెట్టటం లేదు అనే ఊహే అసలు భయంకరం, అంత సాహసం ఎవరు చేస్తారు ? అసలు టిటిడి రికార్డ్స్ లో పింక్ డైమండ్ అనేది లేదు అని రికార్డు లు చెప్తున్నాయి.. అలాగే పోటులో నేలమాలిగలు అనేవి పచ్చి అబద్ధాలు అని పురావస్తు శాఖ డైరెక్టర్ చెప్పారు... ఇన్ని చెప్పినా, నిన్న ఒక పెద్ద నేషనల్ వైడ్ క్యంపైన్ నడిచింది...
ఉన్నట్టు ఉండి, బీజేపీకి అత్యంత ప్రీతి పాత్రుడు, రిపబ్లిక్ టీవీ అర్నాబ్, ఈ విషయం పై నిన్నటి నుంచి రచ్చ రచ్చ చేసాడు.. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, మిగతా ఏ నేషనల్ మీడియా ఈ విషయం పై కనీసం స్క్రోలింగ్ కూడా వెయ్యలేదు... రిపబ్లిక్ టీవీ వెయ్యగానే, బీజేపీ సోషల్ మీడియా పైడ్ బ్యాచ్, విషం చిమ్మటం మొదలు పెట్టింది... మొత్తం ఒక organized అట్టాక్ స్టార్ట్ అయ్యింది... ఎంత మంది అధికారులు, అర్చకులు, రమణ దీక్షితులు ఆరోపణలు తప్పు అని చెప్పినా, వీళ్ళు మాత్రం, బీజేపీ స్క్రిప్ట్ ప్రకారం నడుచుకున్నారు.. వీరికి ఎవరైనా ఎదురు వెళ్తే, వారు హిందూ వ్యతిరేకులు అని ప్రచారం చెయ్యటం వీరికి బాగా అలవాటు.. అందులో భాగమే ఈ కుట్ర... అయితే ఈ కుట్ర కు సంబంధించి, మరో అతి పెద్ద ఆధారం బయట పడింది... పోయిన శుక్రవారం, రమణ దీక్షితులు, ఢిల్లీ వెళ్లి అమిత్ షా ని కలసిన ఫోటోలు బయటకు వచ్చాయి.. అలాగే ఆయన ప్రధానికి అత్యంత దగ్గర అధికారాని కూడా కలిసినట్టు చెప్తున్నారు... మరి ఇదంతా కుట్ర కాక, ఇంకా ఏమిటి ? అయినా దీక్షితులు గారిని స్వామి సేవ చెయ్యమంటే, అమిత్ షా సేవ చెయ్యటం ఏంటి ? అమిత్ షా ఒక సాధారణ ఎంపీ.. అయనను వెళ్లి గెస్ట్ హౌస్ లో కలవాల్సిన అవసరం, ఏమి ఉంటుంది... అమిత్ షా సేవ చేసి వచ్చి, స్వామీ వారికి సేవ చేస్తారా ? ఒక్కటి మాత్రం నిజం, ఇందులో ఎవరిది తప్పు ఉన్నా, వెంకన్న చూస్తూ ఊరుకోడు... అందరి లెక్కలు సరి చేస్తాడు... వడ్డీతో సహా...