గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి కుర్చీ కోసం, పాదయాత్ర చేస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్, ప్రస్తుతం తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడులో పాదయాత్ర చేస్తున్నారు.. ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలు అలా నడుచుకుంటూ, వెళ్లి పోయి, సాయంత్రం ఒక మీటింగ్ చెప్పేసి, ఆ రోజుకి పాదయాత్ర ముగిస్తున్నారు... అయితే, ఈ రోజు జగన్ పాదయత్రలో ఒక వింత సంఘటన చోటు చేసుకంది.. ఈ రోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడులో పాదయాత్ర చేస్తున్న జగన్ ను చూసేందుకు కొంత మంది వైసిపీ కార్యకర్తలు వచ్చారు.. జగన్ తో కలిసి కొంత దూరం నడిచేందుకు ఉత్సాహం చూపారు...
ఈ సందర్భంలో, వారు జగన్ కు దగ్గరికి వెళ్ళకుండా సెక్యూరిటీ సిబ్బంది ఎప్పటికప్పుడు పక్కకి తోసేస్తున్నారు.. అయితే, ఇక్కడ వరకు ఎవరికీ ఇబ్బంది లేదు... ఎవరి సెక్యూరిటీ వాళ్లకి ముఖ్యం కాబట్టి, ఎంత అభిమానులని అయినా పక్కకు తోసేస్తారు.. అయితే, ఇక్కడ పక్కకి తోసే క్రమంలో, అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, ఆ అభిమానుల మేడలో ఉన్న చైన్ లు కొట్టేస్తున్నారు... దీంతో, జగన్ పాదయాత్రలో సెక్యూరిటీ సిబ్బంది చైన్ దొంగిలించారంటూ వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేసారు... సెక్యూరిటీ సిబ్బంది వైఖరిని నిరసిస్తూ కార్యకర్తల ధర్నా చేసారు... మా చైన్లు మాకు ఇప్పించాలి అంటూ, ఆందోళన చేసారు...
నిజానికి ఎప్పటి నుంచో, ఈ ఆరోపణలు ఉన్నాయి... అయితే ఎవరన్నా జేబు దొంగలు ఇలా చేస్తున్నారేమో అని ఇన్నాళ్ళు అందరూ అనుకున్నారు.. కాని, ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది స్వయంగా, చైన్లు కొట్టేయటం చూసిన అక్కడి అభిమానులు అందోళన చేస్తున్నారు... మా తల్లి దండ్రులు కష్ట పడి సంపాదించిన డబ్బు అని, మా బంగారం మాకు ఇచ్చేయాలని ఆందోళన చేసారు... ఈ సెక్యూరిటీ అంతా, పులివెందుల నుంచి వచ్చిన ప్రైవేటు సెక్యూరిటీగా తెలుస్తుంది... ఇప్పటికే, వీరు ఆడ పిల్లల పై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.. అయినా ప్రతి ఊరు తిరిగి హామీలు ఇచ్చే జగన్, ఇలాంటి దొంగలను ఊరు ఊరు తిప్పుతూ, ప్రజలకు ఏమి సందేశం ఇస్తున్నారు ?