వెంకయ్య నాయుడు, మొన్నటి వరకు కేంద్రంలో రాష్ట్రానికి కావాల్సిన సహాయం చేసిన కేంద్ర మంత్రి... తన సొంత శాఖలోనే కాక, మిగతా శాఖల్లో రాష్ట్రానికి సంబంధించిన పనులు చూసుకునే వారు... ఆయన ప్రాతినిధ్యం వహించిన పట్టణాభివృద్ధి శాఖలో చేతనైన సహాయం చేశారు... రాష్ట్రానికి ఇళ్ళ కేటాయింపు, అండర్గ్రౌండ్ డ్రైనేజికి నిధులు, అమరావతికి స్మార్ట్ సిటీ హోదా... ఇలా ఎన్నో పనులు చూసుకునే వారు... ఇలా ఉండగానే ఉప-రాష్ట్రపతిగా వెళ్ళిపోయారు... వెంకయ్యను ఇలా అర్ధాంతరంగా పంపించటం వెనుక చాలా ఊహాగానాలు వినిపించాయి... ఏదేమైనా జరగాల్సింది జరిగిపోయింది... నష్టం మాత్రం రాష్ట్రానికి జరిగింది...
ఉప రాష్ట్రపతి అంటే ఎదో రబ్బర్ స్టాంప్ అనుకున్నారు... చెప్పింది ఊ కొట్టి, పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు అనుకున్నారు... రాజ్యసభని మైంటైన్ చేయటం అనుకున్నారు... కాని ఉప రాష్ట్రపతి హోదాలో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం తపిస్తున్నారు వెంకయ్య.. మోడీ, అమిత్ షా అసలు ఆంధ్రప్రదేశ్ విషయాలు కనీసం పట్టించుకోని సమయంలో, అవకాసం దొరికిన ప్రతి సారి వెంకయ్య, మన గురించి ఆరా తీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు దెబ్బతినకుండా ప్రతిపాదనలు చేయాల్సిన అవసరం ఉందని 15వ ఆర్థికసంఘానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. విభజన చట్టంలో చేసిన హామీలు, పార్లమెంట్‌లో ప్రకటించిన వాగ్దానాలను, ప్రత్యేక ప్యాకేజీని దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు.
తమ విధివిధానాల పరిధిలో ఏపీ నిర్ధిష్ట అవసరాలకు ప్రాధాన్యం ఇస్తామని ఆర్థిక సంఘం సభ్యులు ఆయనకు హామీ ఇచ్చారు. ఏపీతో సహా అనేక రాష్ట్రాలు 15వ ఆర్థిక సంఘం విధి విధానాల పట్ల అభ్యంతరాలు వ్యక్త పరిచిన నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రంగంలోకి దిగారు. 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్, సభ్యులతో విధివిధానాలు, దాని పర్యవసానాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీపై కమిషన్ అనుసరించే స్థూల సూత్రాలపై వివరంగా చర్చించారు. శుక్రవారం తన నివాసంలో ఆయన ఆర్థికసంఘం ఛైర్మన్ ఎన్‌కేసింగ్, సభ్యులు శక్తికాంతదాస్, రమేష్‌చంద్ర, అరవింద్ మెహతాలతో ఉపరాష్ట్రపతి భవన్‌లో దాదాపు గంటసేపు ఈ చర్చల్లో పాల్గొన్నారు.