వైసీపీ ఎంపీల రాజీనామా డ్రామాను ఎలా రక్తికట్టిస్తున్నారో చూస్తున్నాం... వైసీపీ ఎంపీల రాజీనామాలు భావోద్వేగపూరితంగా ఉన్నాయని, ఏపీలో ఉన్న ఉద్వేగ పూరిత పరిస్థితుల వల్ల వారు రాజీనామాలు చేసినట్లు తనకు అనిపిస్తోందని, మొన్న లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్న సంగతి తెలిసిందే. నాలుగు రోజుల క్రితం వైసిపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌తో భేటీ అయ్యారు. అనంతరం సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ.. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత తన పై ఉందని సుమిత్రా మహాజన్ పేర్కొన్నారు. భావోద్వేగపూరితంగా ఉన్నాయి కాబట్టి, మరో వారం రోజుల తరువాత రావాలని స్పీకర్ వారితో చెప్పారు.
అయితే, ఇవన్నీ నకిలీ రాజేనమాలే అని అందరూ మొదటి నుంచి చెప్తున్నారు. ఇప్పుడు రాజీనామాలు ఆమోదించినా, ఎన్నికలు వచ్చే అవకాసం లేదు. సంవత్సరం లోపు సార్వత్రిక ఎన్నికలు ఉంటే, ఏ ఉప ఎన్నికలు జరిపే అవకాసం ఉండదు. అందుకే, ఒక పధ్ధతి ప్రకారం, ఈ స్టొరీ నడిచింది. వీళ్ళు రాజీనామా చేసి, దాదాపు మూడు నెలలు అవుతుంది. అప్పుడే రాజీనామాలు ఆమోదిస్తే, ఉప ఎన్నికలు వచ్చేవి, వీళ్ళను ప్రజలు ఎంత నమ్ముతున్నారో తెలిసేది. అయితే, మొన్న కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే, అరగంటలో ఆమోదించారు. వైసిపీ ఎంపీల రాజీనామాలు మాత్రం, మూడు నెలలు అయినా పెండింగ్ లో పెట్టారు.
వీళ్ళు ఆడుతున్న డ్రామాల పై, మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ లో స్పందించారు. ఏమి నటన...ప్రజలను మభ్యపెట్టి, బీజేపీతో కుమ్మక్కై ఉప ఎన్నికలు రాకుండా జాగ్రత్త పడ్డారని వ్యాఖ్యానించారు. రాజీనామాల డ్రామా ఆడిన వైసీపీ ఎంపీలకు 'భాస్కర్' అవార్డులు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీలు వారి సొంత కథతో 'ఏ1...అర డజను దొంగలు' సినిమా తీస్తే బాగుంటుందని ట్విట్టర్లో మంత్రి లోకేష్ వ్యంగ్ర్యాస్త్రాలు సంధించారు. "ఏమి నటన! YSRCP MPs deserve ‘Bhaskar Awards’ for misleading the public with their resignations drama. In connivance with BJP, they cleverly passed time so as to reach the 1-year threshold before the General elections & ensured that the by-poll situation is avoided! Wah re wah! "I suggest that they invest in making a Tollywood film “A1 మరియు అర డజన్ దొంగలు” based on their own true story."