శ్రీకాకుళం జిల్లాలో స్వర్గీయ ఎర్రంనాయుడు తనయుడు, రామ్మోహ‌న్‌నాయుడు ఎంపీగా చుర‌గ్గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగతి తెలిసిందే... స్వర్గీయ ఎర్రంనాయుడు తెలుగుదేశం పార్టీకి, ఢిల్లీలో అన్నీ తానై చూసుకునేవారు... ఢిల్లీలో రాష్ట్రానికి ఏ పనులు కావలి అన్నా, చంద్రబాబు ఆయనకే బాధ్యతను అప్పచేప్పవారు... ఇక స్వర్గీయ ఎర్రంనాయుడు వాక్ చాతుర్యం గురించి వేరే చెప్పాల్సిన పని లేదు... ఆయన ఆ శ్రీకాకుళ యాసలో మాట్లాడుతూ ఉంటే ఎలాంటి వాడు అయిన కన్విన్స్ అవ్వాల్సిందే... అయితే, తండ్రి చనిపోయిన తరువాత, చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు కూడా, తండ్రిలాగే మంచి పేరు తెచ్చుకున్నారు...

ram mohan 21102017 2

రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ సభ్యుడిగా, పార్లమెంట్ లో ఏంతో చక్కగా మాట్లాడుతూ, అన్ని డిబేట్స్ లో పాల్గుంటూ, అందరి మన్ననలు పొందుతున్నారు... తండ్రిలాగానే, ప్రతి విషయం మీద అవగాహనతో, తన వాక్ చాతుర్యంతో అందరినీ కట్టి పడేస్తూ వస్తున్నారు. తాజాగా కేంద్రం, రామ్మోహన్ నాయుడి ప్రతిభ గుర్తించి, ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చింది. ఈ నెల 22 నుంచి 28 వరకు అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరగనున్న ఐక్యరాజ్యసమితి (ఐరాస) సమావేశాలకు టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడుని, కేంద్రం సెలెక్ట్ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.

ram mohan 21102017 3

అయితే ఈ అరుదైన గౌరవం, గతంలో ఆయన తండ్రి ఎర్రంనాయుడుకి కూడా దక్కింది కూడా. ఎర్రంనాయుడు కూడా ఇది వరకు ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు తన కొడుకు రామ్మోహన్ నాయుడు కూడా, ఐరాస సమావేశాలకు వెళ్లడానికి ఎంపిక కావడం పట్ల టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. తన తండ్రి లాగానే, ఈ యువ ఎంపీ కూడా మంచి పేరు తెస్తాడు అని, మన రాష్ట్రం పేరు నిలబెడతారు అని చెప్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read