నేను ఫుల్ టైం పొలిటీషియన్... నేను 6 నెలలు పాటు, 13 జిల్లాల్లో, 3 వేల కిమీ పాదయాత్ర చెయ్యాలి... నాకు సీరియస్‌నెస్ ఎక్కువ... మధ్యలో డిస్టర్బ్ అయితే కష్టం.. నాకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే బాగా ఇష్టం... అందుకే నా అక్రమాస్తుల కేసులో, ప్రతి శుక్రువారం నేను విచారణకు హాజరుకాలేను... మీరు మినహయింపు ఇవ్వండి, అని జగన్, సీబీఐ కోర్ట్ లో వాదించారు... కోర్ట్ కు రాకపోయినా విచారణకు ఆటంకం ఏమీ ఉండదని, జాప్యం జరిగే అవకాశం కూడా లేదని తెలిపారు. మీరు ఏ షరతు పెట్టినా పర్వాలేదు, కాని నాకు శుక్రువారం మినాహయింపు ఇవ్వండి చాలు అంటూ కోర్ట్ ని వేడుకున్నారు.
ఈ వాదనలు జరుగుతూ ఉండగా, సీబీఐ జడ్జి కొన్ని ఆసక్తి గల ప్రశ్నలు వేశారు.. దీంతో జగన్ లాయర్ ఖంగు తిన్నారు... "మీరు, చట్టాలు, కోర్టులంటే గౌరవమున్న వ్యక్తిగా, బాధ్యతాయుతమైన పౌరునిగా ప్రతి శుక్రవారం కోర్టు విచారణకు హాజరై, మిగిలిన రోజుల్లో పాదయాత్ర చేసుకోవచ్చు కదా... దాంతో అభ్యంతరం ఏముంది ? ఐదు రోజులు పాదయాత్ర చేసి... శుక్రవారం కోర్టుకు వస్తే విచారణకు హాజరైనట్టు ఉంటుంది! కొంత విశ్రాంతి కూడా తీసుకున్నట్లవుతుంది. ప్రకృతి సహకరించకపోతే పాదయాత్రకు ఎలాగూ విరామం ఇస్తారు కదా! అలాగే ప్రతి శుక్రవారం కోర్టు విచారణకు హాజరై మిగిలిన రోజుల్లో పాదయాత్ర చేసుకోవచ్చు కదా!... న్యాయస్థానాల మీదున్న గౌరవంతోనే తాను కోర్టు విచారణకు హాజరవుతున్నానని ప్రజలకు కూడా తెలియచేయవచ్చు కదా!... ’’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు.
అయితే అనుకోని విధంగా ఈడీ కూడా ఎంటర్ అయ్యింది... సిబిఐ తరుపు న్యాయవాదులే ఇప్పటి వరకు జగన్ కు మినహాయింపు ఇవ్వద్దు అని వాదించారు... అయితే, వీరికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడు తోడయ్యింది... జగన్ చేసిన అక్రమాలు, వాటి తీవ్రత వివరించారు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తరఫున న్యాయవాది మన్మథరావు. అసలు ఇలాంటివి విచారణకు కూడా స్వీకరించ కూడదు అని చెప్పారు. గతంలో కూడా ఇలాగే, నేను రాను, నా న్యాయవాదిని పంపిస్తాను అని కేసు వేశారు, అప్పుడు హై కోర్ట్ ఇది కుదరదు అని కొట్టేసింది,,,, ఇప్పుడు పాదయాత్ర పేరుతో, మరో డ్రామా ఆడుతున్నారు అంటూ, ఈడీ వాదించింది. అన్ని పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి... తీర్పును సోమవారానికి వాయిదా వేశారు.