వాళ్ళు అధికార పార్టీ ఎమ్మెల్యేలు... నిత్యం ప్రజలు వారిదగ్గరకు వచ్చి కావలసిన పనులు చేసుకుంటూ ఉండేవారు... ఆ ఎమ్మెల్యేలు కూడా, వారికి చేతనైన సహాయం చేస్తూ, ప్రజల నుంచి మంచి మార్కులు కొట్టేసేవారు.. మరి కొంత మంది ఎమ్మెల్యేలు దగ్గర పనులు అవ్వక, వారికి కావాల్సిన డబ్బులు ఇవ్వలేక, కొంత మంది ఇబ్బంది పడిన సంఘటనలు ఉన్నాయి... ఏదైతేనేమి అధికార దర్పం చూపిస్తూ, రేషన్‌కార్డులు.. పెన్షన్‌లు.. భూ రికార్డులలో తప్పులు సరిచయటం లాంటి పనులు చేపించే ఎమ్మెల్యేలు, ఇప్పుడు చంద్రబాబు చేసిన ఒక పని వల్ల, విచిత్ర పరిస్థితిని ఎదుర్కుంటున్నారు. చంద్రబాబు ఇంత పని చేస్తాడు అనుకోలేదు అంటూ బాధపడుతున్నారు ఎమ్మెల్యేలు...
ప్రజా సమస్యల తక్షిణ పరిష్కారానికి, అలాగే ఎవరైనా లంచం అడిగినా ఫిర్యాదు చెయ్యటానికి, ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవటానికి, చంద్రబాబు 1100 అనే నంబర్‌తో కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశారు.. ప్రజలు ఏ సమస్య అయినా, వెంటనే ఫోన్ చేసి చెబితే సమస్య పరిష్కారం అయిపోతుంది... ఈ 1100 కాల్‌సెంటర్, ప్రజల సమస్యలకు వెంటనే పరిష్కారం చూపుతూ ఉండటం, సమస్యలు పరిష్కారం అవుతున్న తీరు... అవినీతి సొమ్మును కాల్‌సెంటర్ కక్కిస్తున్న వైనంతో ప్రజల్లో కూడా భరోసా ఏర్పడింది... కొంతమంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు కూడా అసలు కాల్‌సెంటర్ ద్వారా పనులు అవుతున్నాయా? లేదా? అని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. సమస్యలు పరిష్కారం కావడంతో సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ కాల్ సెంటర్ వచ్చిన దగ్గర నుంచి, ప్రజలు ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్ళటం మానేసారు... ఇది వరకు ఎమ్మెల్యేల దగ్గర, ద్వితీయ శ్రేణి నేతల వద్దకు వెళ్లి పనులు చేపించుకునే వారు. ప్రస్తుతం ప్రతి సమస్యను కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసి పరిష్కరించుకుంటున్నారని.. తమ దగ్గరకు ఎవరూ రావడం లేదని ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్నారు. అన్ని పనులు కాల్‌సెంటరే చేస్తే ఇక తాము ఎందుకని మరో ఎమ్మెల్యే ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు డ్యాష్‌బోర్డుతో ఈ కాల్‌సెంటర్ కనెక్ట్ అయి ఉండటంతో, ఎమ్మెల్యేలు కూడా ఏమి అనలేని పరిస్థితి... ఆ ఎమ్మెల్యేల బాధ పక్కన పడితే, చంద్రబాబు చేసిన ఈ పని వల్ల, సామాన్య ప్రజలు అయితే, చాలా సంతోషంగా ఉన్నారు... ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా, పనులు జరుగుతున్నందుకు సంతోషిస్తున్నారు...