హైదరాబాడ లోటస్ పాండ్ లో, హ్యాపీగా జీవితం ఎంజాయ్ చేస్తూ, ఎదో రావాలి అన్నట్టు, రెండు నెలలుకు ఒకసారి, ఆంధ్ర రాష్ట్రానికి ఫ్లైట్ లో వచ్చే, సాయంత్రానికి మళ్ళీ హైదరాబాద్ చేక్కేసేవాడు జగన్...
అయితే ఇప్పుడు విజయవాడలో ఒక తాత్కాలిక కార్యాలయం అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు పార్ధసారధి స్థలంలో ఓపెన్ చేశారు... ఇప్పుడు మొదటి సారిగా, జగన్ విజయవాడలో పార్టీకి సంబంధించి, ఈ కార్యాలయంలో సమీక్ష జరపనున్నారు.. బిసి నాయకులతో సమీక్ష జరపనున్నారు.. దీనికి సంబంధించి పరిమిత సంఖ్యలో నాయకులకి పాస్లు ఇచ్చారు... రాష్ట్రం ఏర్పడ్డ తరువాత, మొట్టమొదటి సారి, సొంత రాష్ట్రంలో జగన్ పార్టీకి సంబంధించి సమీక్ష చెయ్యనుండటంతో, జగన్ అభిమానాలు ఇది ఒక స్పెషల్ డే గా అభివర్ణిస్తూ, ఆనందిస్తున్నారు...
ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, ఈ సమీక్ష కోసం ఫ్లైట్ లో గన్నవరం వచ్చి, సమీక్ష అయిపోగానే, సాయంత్రం, హైదరాబాద్ జంప్ అవ్వనున్నారు...
ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అమరావతి నుంచి పరిపాలన చేస్తున్నా, ఇప్పటివరకు ప్రతిపక్ష నాయకుడు, సొంత రాష్ట్రానికి రాకుండా హైదరాబాద్ లో ఉండటంతో, తనకి రాష్ట్రం పట్ల ఎంత ప్రేమ ఉందో అని ప్రజలు అనుకుంటున్న వేళ, ఒక కార్యాలయం ఓపెన్ చేసి, మమ అనిపిస్తున్నాడు జగన్...