దర్శకుడు రాంగోపాల్ వర్మ, జగన్ బావ బ్రదర్ అనిల్ హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్ లో, రహస్యంగా భేటి అయిన విషయం తెలిసిందే... రెండు గంటలపాటు జరిగిన ఈ రహస్య భేటీలో, జగన్ కూడా స్కైప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గున్నారు అని విశ్వాసనీయ సమాచారం... ఈ భేటీలో జగన్ పెదనాన్న కొడుకు అనిల్ రెడ్డి, ఈ సినిమాకు నిర్మాతగా ప్రకటించుకొన్న రాకేశ్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
ప్రధానంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా స్క్రిప్ట్ పై చర్చలు, చిత్ర నిర్మాణానికి కావాల్సిన డబ్బులు మీద చర్చలు జరిగాయి.. ఎన్టీఆర్ క్యారక్టర్ నీచ్చంగా ఉండాలని, అంతకు మించి చంద్రబాబు క్యారక్టర్ ఉండాలని, జగన్ గెట్టిగా చెప్పి, కొన్ని ఎపిసోడ్స్ సొంత స్క్రిప్ట్ కూడా ఇచ్చారని సమాచారం... ఎన్టీఆర్ విలన్ గా ఉండాలి, చంద్రబాబు పెద్ద విలన్ గా ఉండాలి అని జగన్ చెప్పారని చెప్తున్నారు... ఎలాగైనా ఎలక్షన్స్ ముందు ఈ సినిమా రిలీజ్ అవ్వాలని, ముందస్తు ఎన్నికలు వస్తే, అంతకు ముందే ఈ సినిమా వచ్చేలా చూడాలని జగన్ చెప్పారంట...
అలాగే సందులో సందు, బ్రదర్ అనిల్ కూడా, ‘తమసోమా జ్యోతిర్గమయ’ అనే పేరుతో మరో సినిమా తియ్యాలని వర్మను కోరారు అంట... దానికి కూడా ఫండింగ్ కి జగన్ ఒప్పుకున్నారు...
రాకేశ్‌రెడ్డి అనే ఒక డమ్మీ నిర్మాత పేరు చెప్పి, ఫండింగ్ మొత్తం జగన్ ఇస్తున్నారు... ప్రజల్లో ఎన్టీఆర్ మీద చెడు అభిప్రాయం తీసుకురావటం, ఎన్టీఆర్ కొడుకులు, కూతుళ్ళని కూడా నెగటివ్ గా చూపించటం, అన్నిటికీ మించి చంద్రబాబుని పెద్ద విలన్ గా చూపించటం, ఇవి జగన్, వర్మకు ప్రధానంగా చెప్పిన విషయాలు...