తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, అక్రమ ఆస్థులు సంపాదించారని, సిబిఐ, ఈడీ జగన్ పై 11 కేసులు పెట్టిన సంగతి తెలిసిందే... అన్నిట్లో జగన్ A1గా ఉన్నారు... 16 నెలలు జైలు శిక్ష కూడా అనుభవించి, ఇప్పుడు బెయిల్ పై బయట తిరుగుతూ, ప్రతి శుక్రవారం కోర్ట్ కి వెళ్తూ, ఎక్కడకి వెళ్ళాలి అన్నా కోర్ట్ పర్మిషన్ తీసుకుంటూ వెళ్తున్న సంగతి తెలిసిందే... ఈ 11 కేసుల్లో, 3 కేసులు విచారణ త్వరలో ముగియనుంది అనే సమాచారం కూడా వస్తున్న తరుణంలో, ఎలక్షన్ కమిషన్ సుప్రీమ్ కోర్ట్ లో వేసిన పిటీషన్ చూసి, జగన్ కు వణుకు మొదలైంది...
రాజకీయ నేతలు నేరానికి పాల్పడినట్టు రుజువైతే... ఎన్నికల్లో పోటీ చేయకుండా వారిపై జీవితకాల నిషేధం విధించాలంటూ ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. ఇదే విషయాన్ని ఈ రోజు సుప్రీంకోర్టుకు చెప్పింది ఈసి... నేరం రుజువైన రాజకీయ నేతలను జీవితకాలం పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని చెప్పింది. మరోవైపు ఈ విచారణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. దీన్ని అమలు చెయ్యటం సాధ్యం కాదని కోర్టుకు తెలిపింది. పిల్ ను తోసిపుచ్చాలని కోరింది. అయితే సుప్రీం కోర్ట్ దీని మీద నిర్ణయం చెప్పాల్సి ఉంది... సుప్రీం కోర్ట్ కనుక, ఈసి నిర్ణయాన్ని సమర్ధిస్తే, ఇక జగన్ రాజకీయల్లో పోటీ చెయ్యటం కుదరదు... నేనే సియం.. నేనే సియం.. అనటం కూడా కుదరదు...
అసలు ఈ కేసు పూర్వా పరాలు ఇలా ఉన్నాయి... సీనియర్ న్యాయవాది అశ్వని ఉపాధ్యాయ కొన్ని నెలల క్రిత్రం ఈ విషయం పై సుప్రీంకోర్టులో ఓ పిల్ వేసారు... ఆ తర్వాత విచారణ సమయంలో తమ వాదనలు వినిపించేందుకు మరికొందరు చేరారు. అయితే ఈసీ నుంచి మాత్రం సరైన స్పందన రాలేదు. దీంతో, జూలై 12న విచారణ సందర్భంగా ఈసీపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. నేరం రుజువైన నేతలను జీవితకాలం నిషేధించే విషయంలో స్పష్టమైన వైఖరిని తెలయజేయడం లేదంటూ మండిపడింది. దీంతో, ఈరోజు తన వైఖరిని సుప్రీంకోర్టుకు తెలిపింది ఈసీ...