చంద్రబాబు ఎందుకోకాని నిన్న ఓపెన్ అప్ అయిపోయారు... తాను ఎంతలా కష్టపడి అభివృద్ధి చేస్తుని వివరుస్తూ, రాజకీయంగా లబ్ది పొందటానికి, రాష్ట్రాన్ని ఏ విధంగా , ప్రతి పక్షం నాశనం చేస్తుందో వివరించారు... ఈ మూడేళ్ళలో జగన్ పార్టీ చేసిన కుట్రలు అన్నీ చెప్పారు... ఇంకా చాలా చేస్తారు అప్రమత్తంగా ఉండమన్నారు... ప్రజలకు అవి ఎప్పటికిపప్పుడు చెప్పమన్నారు... నిన్న జరిగిన సమీక్షలో ఈ వ్యాఖ్యలు చేసారు... వందల ఏళ్లుగా నిరుపయోగంగా పడి ఉన్న సదావర్తి సత్రం భూములను వేలం వేసి ఆదాయం రాబట్టుకుందామని ప్రయత్నం చేశాం. ఆ భూములపై తమిళనాడు ప్రభుత్వానికి లేని ఆలోచనలు కలిగించి అడ్డుపడేలా చేసి.. వచ్చిన నిధులు కూడా పోగొట్టిన ఘనత వైసీపీది. ఉపాధి హామీ నిధులు రాష్ట్రానికి రాకుండా చేయడానికి కేంద్రానికి ఆ పార్టీ ఎంపీలు ఫిర్యాదులు చేశారు. రాజధానిలో భూములు రైతుల వద్దే ఉంటే ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ అని... రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని దుష్ప్రచారం చేశారు.

cbn 02112017 2

రాజధాని ప్రాంతంలో ఉద్రిక్తతలు పెంచడానికి పంటలు తగులబెట్టించారు. తునిలో రైలు తగలబెట్టి ఒక కులానికి చెడ్డపేరు ఆపాదించాలని చూశారు. పోలవరం కుడి కాలువ భూసేకరణకు అడ్డుపడాలని చూశారు. పట్టిసీమ ప్రాజెక్టు ప్రారంభ సమయంలో కాలువకు గండి కొట్టారు. జల్లికట్టు స్ఫూర్తి అంటూ రాష్ట్రంలో ఉద్రిక్తతలు పెంచాలని ప్రయత్నించారు. విశాఖ పారిశ్రామిక సదస్సు జరిగే సమయంలో విమానాశ్రయంలో బైఠాయించి రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బ తీయాలని చూశారు. అసెంబ్లీ ప్రాంగణంలోని తమ కార్యాలయంలో పైపు కత్తిరించి నీళ్లు లీక్‌ అయినట్లు ప్రచారం చేయించారు. వారి నేర ప్రవృత్తి నేపథ్యంలో రేపటి ఆ పార్టీ పాదయాత్రను నిశితంగా గమనించాలి. నేరాలు చేస్తారా... చేయిస్తారా అన్నది గమనిస్తూ ఉండాలి.

cbn 02112017 3

రాష్ట్రంలో అశాంతి రేకెత్తించడానికి తుని ఘటన తరహా కుట్రలు జరగడానికి అవకాశముంది. పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి’ అని పిలుపిచ్చారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాల్జేయడానికి వాళ్లు దేనికైనా తెగిస్తారని.. ఏమైనా చేస్తారని అన్నారు. ఈ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ‘మీరు రోజూ మాట్లాడి వాళ్ల విలువ పెంచవద్దు. మనమేం చేస్తున్నామో ప్రజలకు చెబుదాం. అది చాలు‘ అని వ్యాఖ్యానించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read