నిన్న అమరావతిలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం బుదవారం నాడు అమరావతిలో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గున్నారు... అసెంబ్లీ బహిష్కరించాలి అన్న వైసీపీ నిర్ణయాన్ని, చంద్రబాబునాయుడు తీవ్రంగా తప్పుబట్టారు. అసెంబ్లీ బహిష్కరించటానికి ఎమ్మల్యేల అనర్హత ముందుకు తీసుకురావటం దారుణం అంటూ, ఆ విషయంలో వైసీపీ చేసిన కుట్ర కోణాన్ని బయటపెట్టారు...

cbn yscp 0211201 2

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అందరూ రాజీనామా చేశారు. అవి స్పీకర్ కు చేరాయి. ఆ అంశం స్పీకర్ పరిధిలో ఉంది. అయితే, స్పీకర్ ఈ విషయం పై నిర్ణయం తీసుకోకముందే, వైసీపీ కోర్టుకు వెళ్ళింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే వైసీపీ నేతలు హైకోర్టుకు వెళ్లారని చెప్పారు. అయితే అక్కడ కేసును డిస్మిస్ చేస్తే సుప్రీం కోర్టుకు వెళ్లారని చంద్రబాబునాయుడు ప్రస్తావించారు. ఈ కేసును సుప్రీం కోర్టు మిగిలిన పిటిషన్లతో కలిపి రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించిన విషయాన్ని గుర్తుచేశారు.

cbn yscp 0211201 3

ఇదంతా జాప్యం చెయ్యటానికి వాళ్ళు చేసిన పని. ఇలా జాప్యం చేసి, ప్రభుత్వాన్ని విమర్శించాలి అనే పనిగా పెట్టుకున్నారు.. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న అంశం గురించి, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలేరు... ఈ అంశాన్ని సాకుగా చూపి శాసనసభ సమావేశాలను బహిష్కరించాలని భావించడం విడ్డూరంగా ఉందన్నారు చంద్రబాబునాయుడు. అసెంబ్లీ సమావేశాలను ప్రజా సమస్యలపై చర్చకు వేదికగా వినియోగించుకోవాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు. పాదయాత్ర కోసం అసెంబ్లీ కి రాకుండా ప్లాన్ వేసి, ఇలా చేస్తున్నారన్నారు... ఇది వరకు అసెంబ్లీ సమావేశాలు చలా జరిగాయని, అప్పుడు లేని బాధ ఇప్పుడేంటి అని చంద్రబాబు అన్నారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read