"ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం మన అదృష్టం... ఆయన అధికారులకు చేత పనులు చేపిస్తున్నారు.... అక్కడ ఏమి జరుగుతుందో, ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో చూడటానికి మమ్మల్ని కూడా తీసుకువెళ్తున్నారు... ఆయన మా సమస్య పరిష్కరిస్తారు అనే పూర్తి నమ్మకం మాకు ఉంది.... సూర్య చంద్రులు ఉండేంత వరకు, మీ లాంటి ముఖ్యమంత్రే కావలి..." ఇది ముఖ్యమంత్రి మీద ఫాతిమా వైద్య కళాశాల బాధితులకు ఉన్న భరోసా... ఒక పక్క వారు ఎంతో కష్టంలో ఉన్నా, ముఖ్యమంత్రి మాత్రమే, మా సమస్య తీరుస్తారు అనే నమ్మకం...
యాజమాన్యపు లోపాల వల్ల విద్యా సంవత్సరం నష్టపోయి వీధుల పాలైన కడప జిల్లా ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులు, తల్లిదండ్రులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తిచేశారు. న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామని విద్యార్థులకు సీఎం హామీ ఇచ్చారు. ఎంసీఐతో మాట్లాడాలని, అవసరమైతే నేను కూడా మాట్లాడుతానని, మంత్రి కామినేనిని సీఎం చంద్రబాబు ఆదేశించారు..
సుప్రీకోర్టుకు తాజా తీర్పు పై మరోసారి పిటిషన్ దాఖలు చేయాలని అధికారులకు ఆదేశించారు... 9 మందితో కమిటీ వేస్తన్నట్లు చెప్పిన చంద్రబాబు, దాంట్లో బాధిత విద్యార్థులు, తల్లిదండ్రులును కూడా భాగస్వామ్యం చేసారు... సమగ్ర పరిశీలన జరిపి కేంద్రంతో మరోసారి చర్చలు జరపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు... ప్రభుత్వ ప్రయత్నాల పై విద్యార్థులు సంతృప్తిగానే ఉన్నారన్న కామినేని, సుప్రీంకోర్టు తీర్పుతో అవకాశాలు మూసుకుపోయాయని, ఇదే విషషమై వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య రేపు దిల్లీ వెళ్తన్నారని, ముఖ్యమంత్రి ఎలా అయినా ఈ సమస్య పరిష్కారం చేస్తారని చెప్పారు... ఆ బాధితులు, ముఖ్యమంత్రి మీద, ఎంత నమ్మకంతో ఉన్నారో, మీరు ఈ వీడియోలో చూడండి...