రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైజాగ్ గెదెల రాజు, పద్మలతల హత్య వ్యవహారం మలుపులు తిరుగుతోంది. ఈ కేసుల్లో కీలక ప్రాత్రధారి, వైసీపీ నేత దామా సుబ్బారావును పోలీసులు అరెస్ట్ చేశారు. కేసులో ఏ 1 గా వున్న ఆర్టీసీ విజిలెన్స్ డిఎస్పీ రవిబాబు లొంగిపోయాడు. ఏ 2 గా వున్న భూపతిరాజును కూడా పట్టుకున్నారు. విశాఖపట్నంలో పలు రౌడీ షీటర్లు, గెదెల రాజు, డిఎస్పీ రవిబాబు, భూపతిరాజులతో కలసి వైసీపీ నేత దామా సుబ్బారావు పలు సెటిల్ మెంట్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ysr 01112017 2

గేదెల రాజు హత్యలో 70 లక్షల వ్యవహారం, పద్మలత హత్య కుసు సుపారీలో కుడా దామా సుబ్బారావు కీలక పాత్ర పోషించాడని పోలీసులు గుర్తించారు. అంతకుముందు, రెండు రోజులు విచారించిన అనంతరం పోలీసులు దామాను విడిచిపెట్టారు. అప్పటి నుంచి దామా అజ్ఞాతంలోకి వెళ్లడంతో పోలీసుల్లో ఆందోళన మొదలైంది. అనవసరంగా విడిచిపెట్టామనే చర్చ పోలీసు వర్గాల్లో జరుగుతోంది. ఈ రెండు మర్డర్లకు సంబంధించి ఫైనాన్స్ వ్యవహారాలన్నీ దామా సుబ్బారావు చేశాడనేది పోలీసులు విచారణలో తేలింది.

ysr 01112017 3

దామా విదేశాలకు పారిపోయే ప్రయత్నాల్లో ఉన్నాడని తెలీడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మొత్తానికి పోలీసులు వైసీపీ నేత దామా సుబ్బారావును అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం పోలీస్‌ స్టేషన్‌కు ఈ కేసుతో సంబంధం వున్న అందరినీ పిలిపించి స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు. చార్జిషీట్‌ దాఖలు చేశాక పోలీసులు చేసిన నేరారోపణలన్నీ తగిన సాక్ష్యాలతో కోర్టు ముందుంచాల్సి వుంటుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read