నిన్న ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులు ప్రకటించారు అంటూ, అన్నీ మీడియా, పత్రికలు హడావిడి చేశారు.. తెలంగాణా ఫస్ట్ అని, ఆంధ్రప్రదేశ్ 15వ స్థానంలో ఉంది అంటూ వార్తలు రాశాయి... అయితే ర్యాంకులు ప్రకటనకు ఇంకా చాలా టైం ఉన్నా, తెలంగాణా ప్రభుత్వ మెప్పు కోసం, హడావిడి చేశాయి... ఏ ఛానల్, ఏ పేపర్ ఎలా రాసినా పెద్దగా పట్టించుకునేవారు కాదు కాని, ఈనాడు రాసే సరికి, అందరూ అది నిజం అని నమ్మారు... చివరకి ఉప రాష్ట్రపతి వెంకయ్య కూడా అదే నిజం అనుకుని తెలంగాణాకు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేశారు...
అయితే ఈనాడు ఇలా చెయ్యటంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి... ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఈనాడు లాంటి క్రడిబిలిటీ ఉన్న పేపర్ ఇలా రాసింది అంటే, ఆశ్చర్యపోయారు... ఈనాడు తప్పు తెలుసుకుని సవరించుకుంటుంది అనుకున్నారు... కాని, ఈనాడు సవరణ అయితే చేసింది కాని, హైదరాబాద్ విషయంలో ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో, రెండవ ర్యాంకు అని చెప్పాం, అది 2009 లో ప్రకటించిన ర్యాంక్ అని చెప్పి, సవరణ అంటూ రాసింది.. కాని, మన ఆంధ్రప్రదేశ్ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించాం, ఇంకా ర్యాంకులు ప్రకటించాల్సి ఉంది అని మాత్రం సవరణ ఇవ్వలేదు...
ఆంధ్రప్రదేశ్ ప్రజలను గందరగోళనని గురి చేసి, కనీసం సవరణ కూడా ఇవ్వకపోవటంతో అందరూ, ఈనాడు విలువలు వదిలేసింది ఏమో అంటూ వ్యాఖ్యానిస్తున్నారు... చివరకి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ వార్తా చూసి, నిజం అనుకుని, సమీక్షకు పిలిచారు అంటే, ఈనాడు వార్త, ఈనాడు మీద ఉన్న నమ్మకం అలాంటింది... అలాంటి ఈనాడు, ఎందుకో కాని, ఈ మధ్య కాలంలో తప్పులు చేస్తుంది, కాని తెలంగాణా తప్పులు ఒప్పుకుంటుంది కాని, ఆంధ్రప్రదేశ్ తప్పులు మాత్రం అసలు పట్టించుకోవటం లేదు... ఈనాడు అంటే, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మందికి అనుబంధం ఉంది... ఇలాగే తప్పుడు వార్తలు రాస్తూ ఉంటే, ఆదరణ కోల్పాతారు... ఏదైనా ఎవరి ప్రయోజనాలు వాళ్ళవి, ఎవరి ప్లాన్ లు వారికి ఉంటాయి.. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు...