పెట్టుబడులే లక్ష్యంగా 10 రోజులు విదేశీ పర్యటనకు వెళ్ళిన చంద్రబాబు, దీపావళి పండుగ రోజు, తన మనవడిని గుర్తు చేసుకున్నారు.. అమెరికాలో, డె మోయిన్స్ తెలుగుదేశం ఫోరం సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు... ఇవాళ పండగ, మీరందరూ ఇంటిదగ్గర దీపావళి చేసుకోవలసిన వాళ్ళు, ఇవాళ నాతో గడపడానికి వచ్చారు. నేనూ ఇంటిదగ్గర, నా మనవడితో దీపావళి చేసుకోకుండా ప్రజలకోసం ఇక్కడికి వచ్చాను అంటూ ఎమోషనల్ అయ్యారు...
68 ఏళ్ళ వయసులో, మనవిడితో పండగ జరుపుకోవాలని, ఎవరికి మాత్రం బాధ ఉండదు చెప్పండి.... కాని అవన్నీ షడ్యుల్ మీటింగ్స్... మన కోసం, అవతలి వాళ్ళు టైం మార్చుకోరు కదా... కోటి రూపాయల పెట్టుబడి వచ్చినా, నవ్యాంధ్రకు ఎంతో ఊతం ఇస్తుంది... అందుకే పండగ అయినా సరే, ఇలాంటి ఎమోషన్స్ పక్కన పెట్టి, రాష్ట్రం కోసం వెళ్లారు ముఖ్యమంత్రి... కాని, మనుసులో ఆ బాధ ఉన్నట్టు ఉంది, అందుకే మన తెలుగు వారు కనపడగానే, తన మనుసులో ఉన్నది చెప్పేశారు...
ఆ ఎమోషన్ పక్కన పెట్టి, ఆయన ఫ్లోలో మళ్ళీ ప్రసంగం మొదలు పెట్టారు... అక్కడ తెలుగువారిని ఉద్దేశిస్తూ, నేను గతంలో చేసిన చిరు ప్రయత్నం వల్ల మీరంతా ఇక్కడికి వచ్చారు. ఎంతో ఉన్నతస్థాయికి వచ్చారు. ఆనాడు 30 ఇంజనీరింగ్ కళాశాలల సంఖ్యను మూడువందలకు పెంచాను. దాంతో అందరూ ఉన్నత విద్యావకాశాలను అందిపుచ్చుకున్నారు. మీరిప్పుడు మంచి స్థాయిలో ఉన్నరు. మీరు పుట్టిన నేలను, మీ జన్మభూమిని మరువకండి. అలాగే, మీ అందర్నీ పైకి తెచ్చిన ఈ నేలను కూడా మరచిపోవద్దు. ఇక్కడి ప్రజల మన్నన పొందండి. ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాలతో మీరు తృప్తి పడకండి. వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలుగా ఎదగండి. మీలో కొంతమంది ఇప్పటికే ఆ స్థాయికి ఎదిగారు. ఇది చాలదు, ఇంకా కావాలి. ప్రపంచంలో ఒక గుర్తింపు పొందడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించండి. అదే సమయంలో మన రాష్ట్రం కోసం కూడా ఎదో ఒకటి చెయ్యండి అంటూ అక్కడ తెలుగువారిని ఉత్తేజ పరిచారు.