ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు కంటే, పెద్ద బ్రాండ్ అంబాసిడర్ మన రాష్ట్రానికి అవసరం లేదు.... గ్లోబల్ గా ఆయన మీద ఉన్న నమ్మకం అలాంటింది... అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబు అక్కడ పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు... మన రాష్ట్రానికి సంబంధించి, ప్రజెంటేషన్ ఇచ్చారు... భారత్ లో ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ బ్యాంక్ నెంబర్ వన్ ర్యాంక్ ఇచ్చిందని చంద్రబాబు అన్నారు. మీరు పెట్టుబడులతో రండి, పరిశ్రమల స్థాపనకు నాది భరోసా అని ముఖ్యమంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎంత బిజినెస్స్ ఫ్రెండ్లీగా ఉంటుందో, పెట్టుబడి పెట్టిన వారు ఎంత సంతోషంగా ఉన్నారోనన్న విషయం, ఇక్కడ పెట్టుబడులు పెట్టిన పారిశ్రామిక వేత్తలను అడిగి తెలుసుకోవచ్చని చెప్పారు. ‘ఆంధ్రప్రదేశ్ ను సందర్శించి ప్రత్యక్షంగా చూస్తే మీకే అర్ధం అవుతుంది’ అని ముఖ్యమంత్రి సదస్యులను ఉద్దేశంచి అన్నారు.

cbn ap 20102017 1 2

పాలనలో పారదర్శకత కోసం పరిపాలనకు సంబంధించి ఫైళ్లను డిజిటలైజ్ చేసి ఆన్‌లైన్లో పెట్టామని, సాంకేతితను మేళవించి సమర్ధమైన రియల్ టైం పరిపాలన అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. రానున్న ఒకటిన్నర, రెండు దశాబ్దాల వరకు 15% వృద్ధి రేటు సాధన లక్ష్యంగా నిర్దేశించుకుని పనిచేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం భారత దేశ సగటు వృద్ధి రేటు కంటే రెట్టింపుగా 11.72% శాతం వృద్ధి రేటు సాధించినట్లు వివరించారు.
పరిశ్రమలు నెలకొల్పడానికి ఆంధ్రప్రదేశ్ ఎంతో అనుకూలమైనదని, పారిశ్రామిక శాంతి ఉంటుందని, అత్యున్నతమైన మానవ వనరులు తమ సొంతమని, స్నేహపూర్వక వాతావరణం కల్పించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వివరించారు. తమ రాష్ట్రానికి వచ్చి ప్రత్యక్షంగా ఈ విషయాలను పరిశీలించవచ్చని అన్నారు. ప్రపంచంలో తాను ఎక్కడ ఉన్నా సీఎం కోర్ డాష్ బోర్డ్ ద్వారా తమ రాష్ట్రంలోని అన్ని శాఖల, అన్ని రంగాల కార్యకలాపాలను పర్యవేక్షించగలనని, ఐటి, ఐఓటీని అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్‌లో పారదర్శక, జవాబుదారీ పాలన అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు.

cbn ap 20102017 1 3

సమావేశంలో డో కెమికల్ ప్రతినిధులు రామనాథ్ సుబ్రహ్మణియన్, మేసీ మెర్రిమేన్ (Macy Merriman), డ్యూపాంట్ పయనీర్ వైస్ ప్రెసిడెంట్ జెర్రి ఫ్లింట్, ఫారిన్ ఎగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ విమల్ శరణ్, గ్లోబల్ ఫుడ్ బ్యాంకింగ్ నెట్ వర్క్ ప్రెసిడెంట్ లిసా మూన్, ప్రొబీర్ ఘోష్, గ్రెయిన్ ప్రొ కంపెనీ ప్రెసిడెంట్ ఫిలిప్ విల్లర్స్, ఐయోవా ఎకనమిక్ డెవలప్‌మెంట్ అథారిటీ బృంద నేత బ్రియాన్ సెలింజర్, సంస్థ ప్రాజెక్టు మేనేజన్ ర్యాన్ యంగ్, జాన్ డీరే ఫైనాన్సియల్స్ డైరెక్టర్ స్టేసీ జాన్సన్, మెక్ లార్టీ అండ్ అసోసియేట్స్ డైరెక్టర్ ఎరిక్ ట్రాషెన్ బర్గ్, నిఫా డైరెక్టర్ సోనీ రామస్వామి, పెప్సికో సీనియర్ డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ రిలేషన్స్ డ్యాన్ క్రిస్టెన్‌సన్, పయనీర్ సంస్థ ప్రతినిధి టామ్ అర్బన్, యుఎస్-ఇండియా ఫౌండేషన్ ప్రసిడెంట్ సీఓ కేవీ కుమార్, యుఎస్ ఐ ఎస్ పిఎఫ్ ప్రెసిడెంట్ డా.ముఖేష్ ఆఘి, డైరెక్టర్ జాసన్ స్టార్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బృందంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ దామోదర్ నాయుడు, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్, అర్థికాభివృద్ది మండలి కార్యనిర్వాహకాధికారి జాస్తి కృష్ణ కిశోర్ ఉన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read