సమాజంలో వివక్షకు గురవుతున్న హిజ్రాల పై, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మానవతా కోణంలో ఆదుకుంటుంది... వివిధ వర్గాల ప్రజలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి కృషి చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం, ఇప్పుడు హిజ్రాలపై దృష్టి సారించింది. ఇప్పటికే ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది... వారికి ఇళ్లు, పెన్షన్లు, రేషన్‌కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంది... ఈ మేరకు గత నెల 21వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు..
2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో, 4.87 లక్షల మంది ట్రాన్స్‌జెండర్లుగా ఉన్నారు.. వారిలో శాతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నారని సమాచారం... సామాజికంగా, ఆర్థికంగా దుర్భర జీవనం గడుపుతున్న హిజ్రాలకునెలనెలా పెన్షన్లు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ముందుగా రేషన్‌కార్డులు, పక్కా ఇళ్లతో పాటు ఆర్థికంగా చేయూత అందించి స్వయం ఉపాధి కల్పన చేపట్టాలని యోచిస్తోంది... ఈ చర్యతో హిజ్రాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు... తమను సమాజంలో ఏంతో వివక్షతో చూస్తారని, ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు మామ్మల్ని పట్టించుకోలేదు అని, చంద్రబాబుకి జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు... ప్రతిపక్షం కూడా మా గురించి, అలోచించి మా సమస్యలను గుర్తించాలి అని కోరుతున్నారు...
ఈ పెన్షన్స, ఇల్లు, రేషన్ కార్డులు ఇచ్చేందుకు, హిజ్రాలను గుర్తించేందుకు ప్రభుత్వం నిర్ధిష్టమైన ప్రమాణాలను రూపొందించనుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం జన్మించినప్పుడు ఉన్న జెండర్‌కు వ్యతిరేకంగా వారి ప్రవర్తన తీరు ఉంటే వారిని ట్రాన్స్‌జెండర్‌గా పేర్కొన్నారు. ట్రాన్స్‌జెండర్‌గా గుర్తింపు చెందాలంటే జిల్లా కలెక్టర్ ఏర్పాటుచేసిన స్ర్కీనింగ్ కమిటీ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కమిటీలో మెడికల్ ఆఫీసర్, సైకాలజిస్టు లేక సైక్రియాట్రిస్టు.. జిల్లా సంక్షేమాధికారి, ఒక ప్రభుత్వ అధికారి, ఒక ట్రాన్స్‌జెండర్ సభ్యులుగా ఉండాలి.