మాకు ఎన్టీఆర్ ఆదర్శం... అందుకే అసెంబ్లీని బహిష్కరిస్తున్నామని జగన్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే... ఇవాళ ఎన్టీఆర్ ఆదర్శం అంటావ్, రేపు చంద్రబాబు ఆదర్శం అంటావ్ అని సొంత పార్టీ నేతలు అంటున్నా, జగన్ ఇదే వాదన ప్రజల్లోకి తీసుకువెళ్లమన్నారు... ఇదే విషయం పై, విదేశాలు నుంచి తిరిగివచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుని స్పందిచమనగా, ఆయన వ్యంగ్యంగా స్పందించారు...
"పులిని చూసి నక్క వాత పెట్టుకుందట. జగన్ వ్యవహారశైలి అలానే ఉంది... ఇంకా నయం ఎన్టీఆర్ ఆదర్శం అని వదిలిపెట్టారు, ఎన్టీఆర్ - జగన్ ఒక్కటే అనలేదు.. ఆయన అసెంబ్లీని బాయ్‌కాట్ చేయడమంటే... ఎవరో ఎందుకో... ఊరుమీద అలిగారన్న సామెతలా ఉంది" అంటూ చంద్రబాబు స్పందించారు... ఎవరైనా అసెంబ్లీ బహిష్కరిస్తారా ? ఆయన రాక పొతే పార్టీలో ఏ ఎమ్మల్యేని అసెంబ్లీకి రానివ్వడా ? దీనికి ఎన్టీఆర్ ఆదర్శం అంటాడా... ఆయనకు, ఈయనకు అసలు ఏమన్నా పోలిక ఉందా అంటూ, చంద్రబాబు వ్యాఖ్యానించారు....
జగన్ చేసిన ఈ వ్యాఖ్యల పై, బిజెపి నాయకులు కూడా స్పందించారు... చంద్రబాబు ప్రతి సోమవారాన్ని ‘పోలవారం’గా మార్చితే, ప్రతిపక్ష నేత జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు వెళుతూ శుక్రవారాన్ని కోర్టువారంగా మార్చేశాడని మంత్రి కామినేని శ్రీనివాస్ రాజమండ్రిలో ఎద్దేవా చేశారు.. కాగా, రాష్ట్రంలో వివిధ పార్టీల భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారని, పాదయాత్రలు చేసుకునే హక్కు ఎవరికైనా ఉంటుందని విశాఖ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు నర్సీపట్నంలో వ్యాఖ్యానించారు...