ఆంధ్రప్రదేశ్ మంత్రి వాహనంలో శక్తివంతమైన వాయిస్ రికార్డర్ బయటపడటంతో, రాష్ట్రంలో ఈ వార్త సంచలనం సృష్టిస్తుంది... ఇంతకీ అది పెట్టింది ఎవరు ? ఎందుకోసం పెట్టారు ? రాజకీయ ప్రత్యర్ధులు పెట్టారా ? మావోయిస్టులు పెట్టారా ? అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.... వివరాల్లోకి వెళ్తే, విశాఖలో మంత్రి అయ్యన్నపాత్రుడు సోదరుడు మున్సిపల్ చైర్మన్ సన్యాసిని పాత్రుడు వాహనంలో గుర్తి తెలియని వ్యక్తులు శక్తివంతమైన వాయిస్ రికార్డర్ పెట్టారు...
వాహనం శుభ్రం చేస్తుండగా వాయిస్ రికార్డర్ పరికరం బయటపడటంతో కలకలం మొదలైంది. మావోయిస్టులు మంత్రి అయ్యన్నపాత్రుడు తనయుడికి హెచ్చరికలు చేసిన నేపథ్యంలో వాయిస్ రికార్డర్ బయటపడటం తీవ్ర అలజడి రేపుతోంది. ఈ వాయిస్ రికార్డర్ ఎవరు అమర్చారు?.. ఎప్పుడు అమర్చారు అనే వివరాలు తెలియాల్సి ఉంది. మావోయిస్టుల నుంచి హెచ్చరికలు ఉండటంతో, ఈ విషయం పోలీసులు గోప్యంగా విచారణ చేస్తున్నారు...
వాహనంలో మాట్లాడే మాటలే కాకుండా ఇంట్లో మాట్లాడుతున్న మాటలు సైతం ఈ వాయిస్ రికార్డర్లో నమోదు అయినట్లు గుర్తించారు. కాగా ఈ పరికారాన్ని చాలా కాలం క్రితమే వాహనానికి అమర్చారని, ఇప్పటికే కొంత సంభాషణలు తరలించుకుపోయారా లేక ఈ పరికరంతో పాటు ట్రాస్మిట్ అయ్యే ఏదైనా పరికరాన్ని అమర్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మావోయిస్టుల కోణంలో కాకుండా, రాజకీయ కోణంలో కూడా విచారణ చేస్తున్నారు...