జగన్ కు నెల రోజులు నుంచి పట్టుకున్న టెన్షన్ వదిలింది... నువ్వు ప్రతి శుక్రువారం కోర్ట్ కి రావాల్సిందే అంది సిబిఐ కోర్ట్... అక్రమంగా ఆస్తులు సంపాదించిన 11 కేసుల్లో ప్రధాన ముద్దాయి, A1 జగన్ మోహన్ రెడ్డికి శుక్రువారం మినహాయింపు కుదరదు అని సిబిఐ కోర్ట్ తేల్చి చెప్పింది... నవంబర్ 2 నుంచి, 6 నెలల పాటు, ముఖ్యమంత్రి అయ్యే లక్ష్యంతో పాదయాత్ర చేస్తున్నా అని, నేను ఫుల్ టైం పొలిటీషియన్ అని, నాకు ప్రతి శుక్రువారం కోర్ట్ కి వస్తే, ఫోకస్ దెబ్బతింటుంది అని, జగన్ కోర్ట్ లో చెప్పారు...
పాదయాత్ర ప్రారంభించిన తరువాత, మధ్యలో ప్రతి శుక్రువరం కోర్టుకు వచ్చి హాజరవడం కష్టమవుతుందని, వ్యక్తిగత హాజరు విషయంలో మినహాయింపు ఇవ్వాలని జగన్ సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్ పై దాదాపు నెల రోజులు నుంచి ప్రతి వారం వాదనలు జరిగాయి. చివరకు, సిబిఐ కోర్ట్ తో, మిమ్మల్ని సంప్రదించకుండా పాదయాత్ర తేదీలు ప్రకటించటం తప్పు అని కూడా వేడుకున్నారు... అయినా కోర్ట్ కనికరించ లేదు. ఇవాళ దీనిపై కోర్టు నిర్ణయం వెలువడించింది.
అంతకు ముంచి సిబిఐ, అనూహ్యంగా ఈడీ కూడా జగన్ కు మినహాయిపు ఇవ్వద్దు అంటూ వాదనలు వినిపించింది... మొత్తం 11 తీవ్రమైన కేసుల్లో A1 అని, అందులో 3 కేసుల్లో విచారణ కీలక దశలో ఉన్నాయి అని, ఇలాంటి పరిస్థితుల్లో 6 నెలలు మినహాయిపు కుదరదు అని చెప్పింది. అంతే కాదు, హై కోర్ట్ ఈ కేసులని త్వరగా పూర్తి చెయ్యమంది అని, మినహాయిపు ఇస్తే డిలే అవుతుంది అని కోర్ట్ కి చెప్పింది. జగన్‌కు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వద్దని సీబీఐ గట్టిగా వాదించింది. సీబీఐ కోర్ట్ కూడా, జగన్ కు సలహా ఇచ్చింది... ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరై మిగిలిన రోజుల్లో పాదయాత్ర చేసుకోవచ్చుకదా అని జగన్ తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డిని సీబీఐ కోర్టు ప్రశ్నించింది. న్యాయస్థానాల మీద ఉన్న గౌరవంతోనే కోర్టు విచారణకు హాజరవుతున్నానన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయవచ్చుకదా అని కోర్టు సూచించింది... మొత్తానికి, అన్ని వాదనలు విన్న కోర్ట్, జగన్ కేసు తీవ్రత పరిగణలోకి తీసుకుని, మినహాయింపు ఇవ్వటం కుదరదు అని, ప్రతి శుక్రువారం కోర్ట్ కి రావాల్సిందే అని చెప్పింది..