ఇప్పటికే ఒకసారి పాదయత్ర తేదీ మార్చుకున్న జగన్, మరో సారి పాదయాత్ర స్టార్ట్ చేసే తేదీ మార్చారు... ఇంతకు ముందు అక్టోబర్ 27 నుంచి పాదయాత్ర చేస్తాను అని గుంటూరులో అతి పెద్ద మీటింగ్ పెట్టి, హడావిడిగా ప్రకటన చేసిన జగన, జోతిష్యులు ఆ టైం బాగోలేదు అని చెప్పారని, నవంబర్ రెండుకు వాయిదా వేశారు... దీనికి తగ్గట్టుగా ప్రచార మెటీరియల్ కూడా రెడీ అయ్యింది... అయితే నిన్న కోర్ట్ తీర్పు నేపధ్యంలో మరోసారి, పాదయాత్ర తేది మార్చాడు జగన్..
ముందుగా అనుకునట్టు నవంబర్ రెండు నుంచి కాకుండా, నవంబర్ 6 నుంచి పాదయాత్ర మొదలు పెట్టనున్నారు... ఇప్పటికైతే ఇది సమాచారం.. మళ్ళీ డేట్ మారుతుందా అనేది చూడాలి... ఈ తేది మార్చటానికి ప్రధాన కారణం, నిన్న వచ్చిన కోర్ట్ తీర్పు అంటున్నాయి, వైసిపి వర్గాలు... శుక్రువారం కోర్ట్ కి రాను అని జగన్ పిటీషన్ పెట్టుకుంటే, అది కుదరదు ప్రతి శుక్రువారం కోర్ట్ కి రావాలి అని సిబిఐ కోర్ట్ చెప్పిన విషయం తెలిసిందే... ఇదే ఇప్పుడు జగన్ కు ఇబ్బంది అయింది... ఎందుకంటే ఆర్భాటంగా నవంబర్ 2న పాదయాత్ర మొదలు పెడితే, ఆ రోజు గురువారం అవుతుంది... కోర్ట్ ఆదేశించింది కాబట్టి, నవంబర్ 3 శుక్రువారం కోర్ట్ కి హాజరు కావాల్సిందే... లేకపోతే అసలకే మోసం వచ్చి, బెయిల్ కూడా రద్దు అయ్యే ప్రమాదం ఉంది... అలా అని పాదయాత్ర మొదలు పెట్టిన తరువాత రోజే కోర్ట్ కి వెళ్తే, ప్రజల్లో చులకని అవుతారు అని సీనియర్లు చెప్పటంతో, జగన్ పాదయాత్ర తేది మార్చారు అని అంటున్నాయి పార్టీ వర్గాలు...
ఇలా డైరెక్ట్ గా చెప్తే పరువు పోతుంది అని, వైసిపి మీడియాకి వేరే రకంగా చెప్పింది. జగన్ షడ్యుల్ ఇలా ఉండబోతుంది.. వచ్చే నెల 3వతేదీ ఉదయం కోర్ట్ కు హాజరు అయిన తరువాత, సాయంత్రం తిరుమలకు జగన్ చేరుకుంటారు. అనంతరం 4వతేదీన తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అలాగే 5వతేదీన కడప పట్టణంలోగల దర్గాను దర్శిస్తారు. అనంతరం పులివెందులకు చేరుకుని చర్చిలో ప్రార్ధనలు చేస్తారు. అనంతరం నవంబర్ 6 నుంచి, ఇడుపులపాయకు చేరుకుని అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు.