ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో, కనిపించిన స్వామీజీల అందరి ఆశీర్వాదం తీసుకుంటున్న జగన్, ఇప్పుడు రూట్ మార్చి పత్రికలు, టీవీ ఛానెళ్ల సిఈఓల పై పడ్డారు... జగన్, తన తండ్రి రాజశేఖర్ రెడ్డి హయం నుంచి, ద్వేషిస్తూ వస్తున్న ఆ రెండు పత్రికల్లో ఒకటైన ఈనాడు రామోజీరావుని ఇప్పటికే రెండు సార్లు కలిసిన జగన్, నిన్న మరో మారు, రామోజీతో భేటీ అయ్యారు... తన కేసులు, బీజేపీతో పొత్తుకు గల అవకాశాలు, అన్నిటికీ మించి ఆశీర్వాదం తీసుకున్నారు... ఒక్క రోజు అయినా నిన్ను జైలుకి పంపిస్తా రామోజీ అని ఛాలెంజ్ చేసిన జగన్, ఇప్పుడు రివర్స్ లో ఆయన ఆశీర్వాదం తీసుకోవటానికి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లారు...
అయితే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని పత్రికలు, టీవీ ఛానెళ్ల సిఈఓలతో జగన్ సమావేశం ఏర్పాటు చేశారు... నవంబర్ రెండు నుంచి పాదయాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో అందరి సపోర్ట్ నాకు కావాలని, మీరందరూ నన్ను ముఖ్యమంత్రిని చేసే అజెండాతో ఈ ఒకటిన్నర సంవత్సరాలు పని చేస్తే, నేను ముఖ్యమంత్రి అవ్వగానే మీ అందరికీ ఒక పధకం పెట్టి ఆదుకుంటాను అని జగన్ చెప్పనున్నారు... ఇప్పటికే కొన్ని పత్రికలు, టీవీ ఛానెల్స్ జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థుతుల్లో ఉన్నాయి... అలాంటి పత్రికలు, టీవీ ఛానెల్స్ అన్నిటినీ ఈ ఒకటిన్నర సంవత్సరాలు కావాల్సిన ఆర్ధిక సహాయం కూడా చేస్తాను అని చెప్పనున్నట్టు సమాచారం... తన పాదయాత్ర తప్ప, ఇంకా ఏ వార్తా రాకూడదు అని, ఈ రాష్ట్రానికి నేనే దిక్కు అనే భావన కలిగించాలి అని, ఆ పత్రికలు, టీవీ ఛానెల్స్ ని అడిగి, వారికి కావాల్సిన భరోసా ఇచ్చి, చివరగా వాళ్ళ అందరి ఆశీర్వాదం తీసుకుని జగన్ పంపించనున్నారు...
అయితే ఇప్పుడు అందరి ద్రుష్టి ఏబిన్ రాధాకృష్ణ పై పడింది... జగన్ ఏబిన్ రాధాకృష్ణని కూడా పిలిచారా లేదా అనే సందేహాలు ఉన్నాయి... ఇప్పటికే జగన్ అండ్ కో, ఏబిన్, ఆంధ్రజ్యోతిని బహిష్కరించినట్టు పిలుపు ఇచ్చాయి... అయితే మారిన పరిస్థుతుల్లో సొంత మతాన్ని కూడా పణంగా పెట్టి స్వామీజీలను, పగను పక్కన పెట్టి రామోజీని కలసిన జగన్, ఏబిన్ రాధాకృష్ణ దగ్గరకు వెళ్ళటం పెద్ద సమస్య కాదు అంటున్నారు... జగన్ కు ముఖ్యమంత్రి కుర్చీ కావలి అని, దాని కోసం మడం తిప్పేస్తారు అని అంటున్నారు వైసిపి ముఖ్య నాయకులు... మరి ఏబిన్ రాధాకృష్ణ స్వయంగా వస్తారా, లేక ప్రతినిధిని పంపిస్తారా ? లేకపోతే జగన్ స్వయంగా రాధాకృష్ణ దగ్గరకు వెళ్తారా అనేది చూడాల్సి ఉంది...