కరువుకి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్... వరుణ దేవుడు మా పార్టీ అన్నాడు ఒక పెద్దాయన... ఆయన మన మధ్య లేడు కాని, ఉంటే ఇప్పుడు ఏమనేవాడో... ఇంకో మహా తల్లి ఉంది.. ఈవిడంటే రాష్ట్రంలో భయపడని వాడే ఉండదు.... ఈవిడ అంటుంది, కరువుకు ఫాంట్ షర్టు వేస్తే అది చంద్రబాబు అంట... మహా తల్లి, ఆవిడ జిల్లలో కురుస్తున్న వర్షాలు చూడలేక, ఎక్కడకి పోయిందో పాపం...

వీరి మాటలు పక్కన పెడితే, ఆ వరుణ దేవుడు చంద్రబాబు పార్టీలో కాదు, ఏకంగా చంద్రబాబు ఇంట్లోనే చేరాడు... ఆయన ఇంటి మనిషి అయిపోయాడు... జల సిరికి హారతి నచ్చిందో ఏమో, ఆయన్ని విడిచి వెళ్ళటం లేదు... అంత ఆత్మీయుడు అయిపోయాడు... చంద్రబాబు సంకల్పం ఫలించి వరుణ దేవుడు ఆంధ్ర రాష్ట్ర నేలను నీటితో నింపేసాడు... రైతుల మొఖంలో చెరగని దరహాసం చిగురించింది....మాకు ఇంత కంటే ఏలాంటి హోదా, హామీలు అవసరం లేదు అంటూ రైతులు ధీరత్వ ధైర్యాన్ని చూపుతున్నారు..... ఒక పక్క చంద్రబాబు రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతుంటే, ఆ వరుణ దేవుడు కూడా చంద్రబాబుకి తోడయ్యారు...

42 ఏళ్ళ తరువాత అనంతపురం లాంటి జిల్లాలో వాగులు, వంకలు, చెరువులు, నదులు నిండి, పొంగి పొర్లుతున్నాయి... రిజర్వాయార్ లు నిండిపోయాయి... దేశంలోనే అత్యల్ప తక్కువ వర్ష పాతం నమోదు అయ్యే సీమలో, ఏకంగా వరదలు వచ్చాయి...

మొత్తం మీద, ఈ ఏడు రాష్ట్రంలో వర్షాలు ఇరగ కుమ్మాయి.. రాష్ట్ర వ్యాప్తంగా 577 మండలాల్లో ఆశాజనకంగా వర్షాలు కురిశాయి. 13 జిల్లాల్లో 670 మండలాలకు గాను, 212 మండలాల్లో అధిక వర్షాలు కురవగా, 365 మండలాల్లో సాధారణ స్థాయిలో వర్షాలు పడ్డాయి.

రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నుంచి ఇప్పటి వరకు 612.8 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటికే 633 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదైంది.

రాష్ట్రంలో 12.34 మీటర్లు లోతున్న భూగర్బజలాలు, తాజాగా 2.24 మీటర్లు పెరిగి 10.1 మీటర్లకు చేరుకున్నాయి.

ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎవరి పార్టీలో చేరారో ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read