నంద్యాల, కాకినాడ తీర్పుతో, చంద్రబాబు కొట్టాడు, కొట్టించుకున్నాను అన్నాడు.. కొట్టించుకున్నాడు కదా, బుద్ధి వస్తుంది అనుకున్నారు ప్రజలు... 40 రోజులు దాక్కుని, ఆ స్వామీజీ కాళ్ళు, ఇంకో పెద్దాయన కాళ్ళు పట్టుకుంటే, పాపం బిడ్డకు మంచి బుద్ధులు వచ్చాయి అనుకున్నారు... 40 రోజులు ఏమన్నా మానసిక పరిపక్తత కోసం ట్రీట్మెంట్ తీసుకున్నాడేమో, ఇక నుంచి కొత్త అన్నాను చూస్తాం అని సంబర పడ్డారు వారి అనుచరులు... కాని పెద్దలు అన్నట్టు, పుట్టుకుతో వచ్చింది, చచ్చే దాకా పోదు అన్న మాటలు నిజం అని మరో సారి తేలింది...
ప్రత్యేక హోదా తెస్తాను అని ఈ పోటుగాడు అనంతపురంలో ఒక ఫంక్షన్ హాల్ లో మీటింగ్ పెట్టాడు... పోటుగాడు కదా, ప్రత్యేక హోదా ఇవాల్సిన మోడీని నిలదీస్తారు అని ఎదురు చూసారు అందరూ... కాని యధావిధంగా చంద్రబాబు చంద్రబాబు చంద్రబాబ....
సరే రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రత్యర్థి కాబట్టి చంద్రబాబుని విమర్శించాలి... కాని దానికి హద్దు ఉండాలా వద్దా ? చంద్రబాబు సుందర ముఖం చూసి పరిశ్రమలు పెట్టేందుకు ఎవరూ రావట్లేదు అంటాడు ఈ పోటుగాడు... ఈ పిచ్చి మాటలు మాట్లాడినందుకే, నంద్యాల ప్రజలు చావు దెబ్బ కొట్టారు... అయినా సిగ్గు లేదు...
ఆయన మొఖం చూసే ఆ రోజు మైక్రోసాఫ్ట్ వచ్చింది.... ఈ రోజు కియా మోటార్స్ వచ్చింది... 5 రాష్ట్రాల పోటీ పడితే, ఈయన మొఖం చూసే అనంతపురం వచ్చింది కియా... ఒకసారి శ్రీ సిటీ వెళ్లి చూడు, ఆయన మొఖం చూసి ఎన్ని దిగ్గజ కంపెనీలు వచ్చాయో... ఇక్కడ నుంచి ప్రపంచానికి మొబైల్ ఫోనులు, కార్లు, టీవీలు తయారు చేసి కంపెనీలు ఉన్నాయి... అవన్నీ ప్రత్యేక హోదాతో రాలేదు... చంద్రబాబు మొఖం చూసే వచ్చాయి...
మీ మొఖాలు, మీ అయ్య మొఖాలు చూసి, జైళ్ళుకి వెళ్ళిన పారిశ్రామికవేత్తలు ఉన్నారు... అయినా మొహం చూసి పెట్టటానికి, అవి ఏమన్నా ముద్దులు అనుకున్నావా? కంపెనీ లు.. ..తల నిమిరి, నుదిటి మీద ముద్దు పెట్టి, చెంపలు నిమిరితే కంపెనీలు రావు...
ఈయన మారతాడు అనుకోవటం మన భ్రమ... మారడు కాక మారడు... ప్రజలే సరైన నిర్ణయం తీసుకోవాలి...