రాష్ట్రంలో ప్రతిపక్షం సడన్ గా, ప్రత్యేక హోదా అంశం ఎత్తుకుంది.. ప్రధాని మోడీని కలిసి వచ్చిన తరువాత, సుమారు 7 నెలల నుంచి, జగన్ ప్రత్యేక హోదా అనే అంశం మర్చిపోయారు... జూన్ నెలలో, మా ఎంపీలు రాజీనామా చేస్తారు అన్న విషయం కూడా మర్చిపోయి, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో NDAకి మద్దతు ఇచ్చారు...

ఏమైందో ఏమో తెలీదు కాని, సడన్ గా ప్రత్యేక హోదా అని అనంతపురంలో ప్రత్యేక్షం అయ్యారు... మళ్ళీ మా ఎంపీలు రాజీనామా చేస్తారు అని చెప్పారు...

అయితే ఇక్కడ ఒక షరతు పెట్టాడు జగన్... రాజీనామాలు చివరి అస్త్రం అంట... తను పాదయాత్ర చేస్తూ, "ప్రత్యేక హోదా" పై మోడీతో పోరాడుతారు అంట... పాదయాత్ర పుర్తియినా ప్రత్యేక హోదా రాకపోతే, అప్పుడు రాజీనామాలు చేపిస్తా అని చెప్తున్నారు...

ఇలా చెప్పి, ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నాడు జగన్... ఈయన పాదయాత్ర 6 నెలలు అంటే, దాదాపు ఏప్రిల్ 2018 దాకా జరుగుతుంది... అప్పుడు ఏ మే నేలలోనో రాజీనామాలు చ్పెపిస్తే, మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉండదు... అప్పటికి సార్వత్రిక ఎన్నికలకు ఒక ఏడాది మాత్రమే గడువు ఉంటుంది... ఇంకో పక్క, మోడీ దేశం అంతా ఒకేసారి ఎన్నికలు అంటున్నారు... అంటే సెప్టెంబర్ లో వచ్చే అవకాశాలు ఉంటాయి.. కాబట్టి, వీళ్ళు మే, జూన్ నెలలో రాజీనామా చేసినా, ఎలక్షన్ కమిషన్ మళ్ళీ ఉప ఎన్నికలు పెట్టే అవకాశం ఉండదు...

ఇలా, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు జగన్ ప్లాన్ వేశారు... ఒకటి, ఈయన రాజీనామా చెయ్యమన్నా, అందరూ ఎంపీలు, రాజీనామా చేసే అవకాశం లేదు... రెండు, ఒకవేళ ఎన్నికలు వచ్చినా, ఇప్పుడు ఉన్న పరిస్థుతులలో జగన్ పార్టీ గెలిచే అవకాశమే లేదు... అందుకే జగన్, తెలివిగా ఈ నిర్ణయం తీసుకున్నారు.. ప్రజల్లో, నేను రాజీనామా చేశాను అనే బిల్డ్ ఇవ్వటం కోసం మాత్రమే, ఈ రాజీనామాల డ్రామా ఆడుతున్నారు అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read