చంద్రబాబు అంటే కార్పొరేట్ వరల్డ్ లో ఎంత క్రేజ్ ఉందో వేరే చెప్పాల్సిన పని లేదు... అప్పటి మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి, ఇవాల్టి ఫిన్ టెక్, బ్లాక్ చైన్ టెక్నాలజీ దాకా, చంద్రబాబు చేసిన పనులు చూసి, ఎంతో మంది టెక్ కంపనీల్ సీఈఓలు ఆయన్ను ప్రశంసించిన సందర్భాలు చూశాం...
రెండు రోజుల నుంచి వైజాగ్ వేదికగా జరుగతున్న అంతర్జాతీయ బ్లాక్ చైన్ టెక్నాలజీ సదస్సులో, 25 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు చంద్రబాబు తీసుకున్న చొరవను అభినందించారు...
టెక్ మహింద్రా కంపెనీ సీఈఓ గుర్నాని, తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా చంద్రబాబుని పొగడ్తలతో ముంచెత్తారు... "గత హయాంలో సాఫ్ట్ వేర్ ప్రగతికి బాటలు వేశారు.. నేడు బ్లాక్ చైన్ టెక్నాలజీకి దారులు చూపుతున్నాడు... డిజిటల్ ఇండియా కి అసలుసిసలు భాష్యం ఇదే...ఇదే మాలాంటి వారికి స్పూర్తి" అంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశంసించారు...
మన రాష్ట్రంలో ఉండే కొంత మంది ఇది చూసైనా బుద్ధి తెచ్చుకున్తారేమో చూద్దాం... మొహాలు చూసో... బుగ్గలు నిమిరితోనో పెట్టుబడులు రావు... దానికి కావాల్సింది వేరే ఉంది... ఎన్ని జన్మలు ఎత్తినా, చంద్రబాబు స్థాయికి చేరుకోలేము అని విషయం గ్రహించి, ప్రజల సమస్యలు మీదా ఆ నాయకులు పోరాడతారని ఆశిద్దాం...
Congratulations, @andhrapradeshCM @ncbn Your relentless focus on #digital and new age technology inspires us @techmahindra #blockchain https://t.co/PTHD4OYEoV
— CP Gurnani (@C_P_Gurnani) October 10, 2017